The Ba***ds of Bollywood: షారుఖ్ ఖాన్ త‌న‌యుడి.. మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:27 PM

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ద‌ర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెర‌కెక్కించిన చిత్రం “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”

Aryan Khan

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ద‌ర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెర‌కెక్కించిన చిత్రం “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్” (The Ba***ds Of Bollywood). ఇటీవ‌ల కిల్ సినిమాతో అల‌రించిన హీరో, విల‌న్ పాత్ర ధారులు లక్ష్య (Lakshya), రాఘవ్ జుయ‌ల్ (Raghav), మ‌రోసారి తెర పంచుకోగా బాబీ డియోల్ (Bobby Deol) , షహెర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఆ మ‌ధ్య షారుఖ్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో నిర్శ‌హించిన ఈవెంట్‌లో టీజర్‌ లాంచ్ చేయగా, మంచి స్పంద‌న‌ను ద‌క్కించుకుంది. అయితే.. ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో సెప్టెంబ‌ర్ 18నుంచి స్ట్రీమింగ్ అవ‌నుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. గ‌తంలోవిడుద‌ల చేసిన‌టీజ‌ర్‌ను మించి ట్రైల‌ర్ ఉంది. బాలీవుడ్ హీరోలు వారి లైఫ్‌స్టైల్ నేప‌థ్యంలో సెటైరిక‌ల్‌గా ఈ చిత్రం రూపొంద‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Sep 08 , 2025 | 05:27 PM