8 Vasanthalu: కథ విని ఏడ్చేశానంటున్న అనంతిక సనీల్ కుమార్

ABN , Publish Date - Jun 14 , 2025 | 06:40 PM

మ్యాడ్ చిత్రంలో నటించిన అనంతిక సనీల్ కుమార్ లేటెస్ట్ మూవీ 8 వసంతాలు. తన మనసుకు నచ్చిన పాత్రను ఇందులో చేశానని అనంతిక చెబుతోంది.

'మ్యాడ్' (MAD) మూవీలో నటించిన అవంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) తాజా చిత్రం '8 వసంతాలు' (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీని నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను మీడియాతో పంచుకుంది అనంతికా సనీల్ కుమార్.


'8 వసంతాలు' మూవీ గురించి అనంతిక మాట్లాడుతూ, 'ఇది విమెన్ కి సంబంధించిన కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత వుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ కి లేయర్స్ ఉంటాయి. ఇలాంటి మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. ఫర్ఫార్మెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్ గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్ చెప్తున్న కథ ఇది. నేను శుద్ధి యోగ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత. అలాగే తనకి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది' అని తెలిపింది.

Also Read: Samantha: అన్నీ దాటిపోవాలి.. సమంత పోస్ట్ వైరల్ 


GANI9567.JPGఇదో ప్యూర్ లవ్ స్టోరీ అని చెబుతూ, 'రియల్ గా ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి రిలేట్ అవుతుంది. ఇందులోని నా పాత్రకు తగ్గట్టు ప్రిపేర్ కావడం పెద్దంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే నేను బ్లాక్ బెల్డ్ హోల్డర్ ను. ఈ సినిమా కోసం కళరి ఫైట్ నేర్చుకున్నాను. అలాగే వింగ్ చున్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ ని కూడా నేర్చుకున్నాను. దాని కోసం మూడు నెలలు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను' అని అనంతిక తెలిపింది. దర్శకుడు ఫణీంద్ర తనకు గురువుతో సమానమని చెబుతూ, 'ఈ జర్నీలో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన క్లియర్ విజన్ తో ఉంటారు. చాలా పాషనేట్ ఫిలిం మేకర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. మైత్రి మూవీ మేకర్స్ నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టులో తీసుకున్నందుకు నిర్మాతలకు థాంక్స్ చెప్తున్నాను. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి సినిమాని తీయడానికి చాలా గట్స్ కావాలి. సంగీత దర్శకుడు హేషమ్ రెండు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెండు పాటలు ఆడియన్స్ కి చాలా నచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది' అని తెలిపింది. సినిమాల్లోకి వచ్చినా... రాజకీయాలంటే తనకు ఆసక్తి అని, రాజకీయ నాయకురాలు కావాలని ఉందని, అందుకే లా చదువుతున్నానని అనంతిక చెప్పడం విశేషం. అయితే అది ఇప్పుడు కదాని, తనకు 40 యేళ్ళు వచ్చిన తర్వాత ఆ రంగంలోకి వెళతానని నవ్వుతూ తెలిపింది అనంతిక.

Also Read: Anirudh Ravichander: సన్ రైజర్స్  జట్టు ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి..  క్లారిటీ ఇచ్చిన టీమ్ 

Updated Date - Jun 14 , 2025 | 06:40 PM