సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AM Rathnam: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నా..

ABN, Publish Date - Jul 21 , 2025 | 06:17 PM

సాధారణంగా హీరోల ఫ్యాన్స్ కు తమ హీరో ఎక్కడ కనిపించినా.. వారు నటిస్తున్న చిత్రాల గురించి అడుగుతూ ఉంటారు. రెండు సినిమాల్లో నటిస్తే రెండు సినిమాల గురించి మాట్లాడతారు.

Harihara Veeramallu

AM Rathnam: సాధారణంగా హీరోల ఫ్యాన్స్ కు తమ హీరో ఎక్కడ కనిపించినా.. వారు నటిస్తున్న చిత్రాల గురించి అడుగుతూ ఉంటారు. రెండు సినిమాల్లో నటిస్తే రెండు సినిమాల గురించి మాట్లాడతారు. కానీ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ కనిపించినా.. పవన్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. వారి నోటి నుంచి వచ్చేది ఓజీ (OG).. ఓజీ అనే. పవన్ రాజకీయ పార్టీ అవ్వొచ్చు.. తిరుమల దర్శనం కావొచ్చు.. వేరే రాష్ట్రంలో మీటింగ్ కావొచ్చు.. ప్రచారం అయినా.. పార్టీ మీటింగ్ అయినా.. సోషల్ మీడియా అయినా.. సినిమా ఈవెంట్ అయినా పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు.. ఓజీ.. ఓజీ.. అని అరవడం, ఆ సినిమా గురించి చెప్పమని గోల చేయడం ఫ్యాన్స్ కు ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగా మారింది.


ఈ విషయమై పవన్ ఎన్నోసార్లు.. ఫ్యాన్స్ ను మందలించాడు.. మండిపడ్డాడు. అయినా కూడా వారిలో మార్పు రాలేదు. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కాకుండా పవన్ నటించిన మరో సినిమా హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించాడు. ఎన్నో వాయిదాల తరువాత వీరమల్లు జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తరువాత ఏఎం రత్నం బాధ చూడలేక పవన్ ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.


ఇక ఇన్నేళ్ల తరువాత ఏఎం రత్నం.. తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. ఇప్పటివరకు అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమాలో చాలామంది ఏఎం రత్నంపై కూడా కౌంటర్లు వేశారు. ఏ ఒక్కరు కూడా హరిహర వీరమల్లు గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ఆయన పక్కన ఉన్నప్పుడు కూడా అందరూ ఓజీ ఓజీ అనే అరిచేవారు. అది ఏఎం రత్నంను ఎంతో బాధకు గురిచేసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.


తాజాగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఏఎం రత్నం మాట్లాడుతూ.. ' ఇన్నిరోజుల వరకు పవన్ కూడా.. హరిహర వీరమల్లు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. వేరే సినిమాల గురించి కూడా మాట్లాడలేదు అనుకోండి. కానీ, ఫ్యాన్స్ లో షార్ట్ టైటిల్ కాబట్టి అందరూ ఓజీ.. ఓజీ అంటున్నారు. మాది హరిహర వీరమల్లు పెద్ద టైటిల్. కానీ, నేను ఫీల్ అయ్యేవాడిని. కనీసం వీర.. వీర అని పిలవచ్చు కదా అని.. కానీ, ఎవరూ అనలేదు. ఈవాళ ఆయనే వచ్చి నా సినిమా గురించి చెప్పారు' అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నా అని కొందరు.. పాపం రత్నం మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Indian Films: నెల రోజుల వ్యవధిలో నాలుగు చిత్రాలు ఒకే తీరుగా...

Natti Kumar: ఫిష్ వెంకట్ కు ఎందుకు సాయం చేయాలి..

Updated Date - Jul 21 , 2025 | 06:17 PM