Allu Sirish: అల్లు శిరీష్ ఎంగేజ్ మెంట్ వీడియో చూశారా..

ABN , Publish Date - Nov 03 , 2025 | 07:09 PM

అల్లు వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. నయనికా రెడ్డి(Nayanika Reddy)తో శిరీష్ నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది.

Allu Sirish

Allu Sirish: అల్లు వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. నయనికా రెడ్డి(Nayanika Reddy)తో శిరీష్ నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీతో పాటు చాలా దగ్గర సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక శిరీష్ - నయనిక ఎంగేజ్ మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేసాయి.

శిరీష్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ తన లవ్ స్టోరీని కూడా చెప్పుకొచ్చాడు. 'నా ప్రేమ కథ చెప్పాలంటే 2023 అక్టోబరులో వరుణ్‌- లావణ్యల పెళ్లి సమయానికి వెళ్ళాలి. ఆ సమయంలో నితిన్‌, షాలిని నూతన జంటకు పార్టీ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్స్‌కు షాలిని బెస్ట్‌ఫ్రెండ్‌ నయనిక కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ రోజే నయనికను మొదటిసారి చూశా. రెండేళ్ల తర్వాత మేము ప్రేమలో ఉన్నాం, నిశ్చితార్థం చేసుకున్నాం. మా పరిచయం ఎలా మొదలైందంటూ ఏదో ఒక రోజు మా పిల్లలు అడిగితే ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ థాంక్స్‌' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా శిరీష్ తన ఎంగేజ్ మెంట్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో నయనిక.. శిరీష్ పైతనకున్న ప్రేమను చెప్పుకొచ్చింది. అతను ఎంతో కేరింగ్ గా చూసుకుంటాడని.. అదే శిరీష్ లో తనకు బాగా నచ్చుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Syamala Devi: గుమ్మడి నర్సయ్య గా శివన్న మెప్పిస్తారు

Pooja Hegde: బుట్టబొమ్మ.. మళ్లీ ఛాన్స్ పట్టిందమ్మా

Updated Date - Nov 03 , 2025 | 07:09 PM