Pooja Hegde: బుట్టబొమ్మ.. మళ్లీ ఛాన్స్ పట్టిందమ్మా
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:20 PM
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) వేగం పెంచింది. ఐరెన్ లెగ్ నుంచి బయటకు రావడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది.
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) వేగం పెంచింది. ఐరెన్ లెగ్ నుంచి బయటకు రావడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఈ ఏడాది రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత కూలీ సినిమాలో మోనికా సాంగ్ తో రచ్చ చేసిన పూజా.. ఎలాగైనా ఒక్క సినిమాతోనైనా హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గట్లే అవకాశాలను కూడా అందుకుంటుంది.
ఇప్పటికే విజయ్ సరసన జన నాయకుడు సినిమాలో నటిస్తున్న పూజా.. ఈ మధ్యనే దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా కాంచన 4 లో కూడా ఛాన్స్ పట్టేసింది. ఇక ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను కూడా అందుకుంది పూజా. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కూడా పూజా రొమాన్స్ చేయడానికి సై అంది.
ఈ ఏడాది కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ధనుష్ ప్రస్తుతం తన 55 వ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అమరన్ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మంత్రంముగ్దులను చేసిన డైరెక్టర్ రాజ్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ తన 55 వ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ పూజా పేరును అధికారికంగా తెలపనున్నారట. మరి వరుస సినిమాలను లైన్లో పెట్టిన బుట్టబొమ్మ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
Rashmika Mandanna: మహేష్ బాబులో నచ్చేది అదే..
Dheekshith Shetty: ఈ సినిమా చూస్తే చాలా విషయాలు నేర్చుకుంటారు