Syamala Devi: గుమ్మడి నర్సయ్య గా శివన్న మెప్పిస్తారు
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:32 PM
ఓ వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావడం అంటే అంత సాధారణమైన విషయమేమీ కాదు. పైగా ఓ రాజకీయ నాయకుడు.. అజాత శత్రువు.. నిజాయితీ పరుడు.. ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నర్సయ్య (Gummadi narsaiah) లాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం సాహసం అనే చెప్పాలి.
ఓ వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావడం అంటే అంత సాధారణమైన విషయమేమీ కాదు. పైగా ఓ రాజకీయ నాయకుడు.. అజాత శత్రువు.. నిజాయితీ పరుడు.. ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నర్సయ్య (Gummadi narsaiah) లాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే (Parameswara Hiwrale) చేస్తున్నారు. ‘గుమ్మడి నర్సయ్య’గా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ (Shivaraj kumar) కనిపించబోతోన్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు? ఏ మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకున్నారు. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోసేందుకు సిద్దంగా ఉన్నారని లుక్ చూస్తే అర్థమైంది. తాజాగా ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన కృష్ణం రాజు భార్య శ్యామలా దేవీ (Syamala devi) దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.

ఆమె మాట్లాడుతూ 'లుక్ ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ గారు ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతోన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర ఆర్టిస్టులకి సంబంధించిన విషయాల్ని ప్రకటించనున్నారు.