Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యనా.. మజాకానా.. హీరోయిన్ ను మించి ఉందిగా
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:07 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత స్టైలిష్ గా ఉంటాడో అందరికీ తెల్సిందే. మొదట బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఆ తరువాత అది ఐకాన్ స్టార్ గా మారింది.
Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత స్టైలిష్ గా ఉంటాడో అందరికీ తెల్సిందే. మొదట బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఆ తరువాత అది ఐకాన్ స్టార్ గా మారింది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటాడు బన్నీ. ఇక ఈ స్టైలిష్ స్టార్ కు తగ్గట్లే ఆయన భార్య కూడా చాలా అందంగా.. స్టైల్ గా కనిపిస్తూ ఉంటుంది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి (Allu Sneha Reddy) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెళ్లి తరువాత భర్తలు మారిపోతారు అని అంటారు. అందుకు సెలబ్రిటీలు అతీతమేమి కాదు. బెస్ట్ ఉదాహరణ బన్నీ అనే చెప్పొచ్చు. స్నేహతో పెళ్ళికి ముందు బన్నీ ఈవెంట్స్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది. తన సినిమాల్లో ముద్దు సీన్స్ ను కూడా కట్ చేసేశాడు. ఇదంతా స్నేహ వలనే అని బన్నీ చెప్పుకొచ్చాడు కూడా. ఇక పెళ్లి తరువాత స్నేహ అడపదడపా సోషల్ మీడియాలో కనిపించేది. ఆ తరువాత బన్నీ సినిమాలను ప్రమోట్ చేస్తూ కనిపించేది. ఎప్పుడైతే అయాన్, అర్హ జన్మించారో అప్పటి నుంచి నిత్యం వారి ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది.
ఇక ఈ మధ్యకాలంలో స్నేహ ఎక్కువ తన ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఫోటోషూట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న స్నేహ తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. గత కొన్నిరోజులుగా ఆమె ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఆమె వెళ్లిన ప్రతి ప్లేస్ కిసంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ వెకేషన్ లో డిజైనర్ డ్రెస్ లలో స్నేహ చాలా స్టైలిష్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్నేహ ఫోటోలను చూసిన అభిమానులు హీరోయిన్ ను మించి అందంగా ఉంది అని కొందరు.. అల్లు అర్జున్ భార్యనా.. మజాకానా అని ఇంకొందరు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Toxic: హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌తో.. ఇండియన్ స్టంట్‌మెన్స్
The Girlfriend: ఏం జరుగుతోంది ప్రోమో.. మరో చార్ట్ బస్టర్ లోడింగ్