Toxic: హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌తో.. ఇండియన్‌ స్టంట్‌మెన్స్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 06:21 PM

యశ్‌ (Yash) ‘కేజీఎఫ్‌’ క్రేజీ సక్సెస్‌  తర్వాత పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. ఆయన నటిస్తున్న 19వ సినిమాగా రూపొందుతుంది.

యశ్‌ (Yash) ‘కేజీఎఫ్‌’ క్రేజీ సక్సెస్‌  తర్వాత పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఆయన నటిస్తున్న 19వ సినిమాగా రూపొందుతుంది. గీత్‌ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.   కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌పై వెంకట్‌ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

toxic (2).jpeg

 ప్రస్తుతం 45 రోజుల యాక్షన్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ జేజే పెర్రీ (JJ Perry) పర్యవేక్షణలో ఈ షెడ్యూల్‌ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్న స్టంట్‌మెన్స్‌ అంతా ఇండియాకు చెందినవారే కావడం విశేషం. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌తో భారత బృందం పని చేేస అవకాశం రావడం నిజంగా అరుదైన అవకాశమనే చెప్పాలి. 

toxic (3).jpeg

హ్యూమా ఖురేషి, టారా సుతారియా, రుక్మిణి వసంత్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. 

Updated Date - Aug 25 , 2025 | 06:21 PM