Allu Arjun: భార్య బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన బన్నీ
ABN, Publish Date - Sep 29 , 2025 | 05:48 PM
పెళ్లి తరువాత అమ్మాయిలే కాదు. అబ్బాయిలు కూడా చాలా మారతారు. అల్లరితనం పోయి బాధ్యత వస్తుంది. బాయ్ నుంచి జెంటిల్ మ్యాన్ గా మారతాడు.
Allu Arjun: పెళ్లి తరువాత అమ్మాయిలే కాదు. అబ్బాయిలు కూడా చాలా మారతారు. అల్లరితనం పోయి బాధ్యత వస్తుంది. బాయ్ నుంచి జెంటిల్ మ్యాన్ గా మారతాడు. అల్లు అర్జున్ (Allu Arjun) ని ఒక పూర్తి జెంటిల్ మ్యాన్ గా మార్చింది ఆయన భార్య స్నేహరెడ్డి (Sneha Reddy). పెళ్ళికి ముందు బన్నీ వేరు.. పెళ్లి తరువాత బన్నీ వేరు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇక ఇద్దరు పిల్లలు పుట్టాకా.. బన్నీ పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యాడు.
షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ వచ్చినా సరే కుటుంబంతో సహా వెకేషన్ లో వాలిపోతూ ఉంటాడు. ఇక ఈసారి మాత్రం షూటింగ్ కు ఆయనే గ్యాప్ ఇచ్చి మరీ కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి కారణం నేడు స్నేహ రెడ్డి బర్త్ డే. భార్య స్నేహ బర్త్ డే వేడుకలను బన్నీ నెదర్లాండ్స్ క్యాప్టిల్ అయిన ఆమ్స్టర్డ్యామ్ లోజరిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అటు బన్నీ.. ఇటు స్నేహ అభిమానులతో పంచుకున్నారు.
ముఖ్యంగా బన్నీ.. తన భార్య స్నేహతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. స్పెషల్ గా హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అల్లు ఫ్యాన్స్ సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
OG Collections: నాలుగు రోజులు.. ఓజీ కలెక్షన్స్ ఎంతో తెలుసా
Rashmika Mandanna: థామా సాంగ్.. మరోసారి రెచ్చిపోయిన రష్మిక..