OG Collections: నాలుగు రోజులు.. ఓజీ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా

ABN , Publish Date - Sep 29 , 2025 | 05:15 PM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ తెరకెక్కించిన ‘ఓజీ’ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా..


పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ 9Sujeeth) తెరకెక్కించిన ‘ఓజీ’ (OG collections) చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా (గ్రాస్‌) వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్టర్‌ విడుదల చేసి తెలిపింది. విడుదలైన తొలి రోజే రూ.154 కోట్లకుపైగా వసూలు చేసిందీ సినిమా. మొదటి రోజు అఽత్యధికగా వసూళ్లు రాబట్టిన టాప్‌ 10 చిత్రాల్లో ఓజీ కూడా చేరింది. టాలీవుడ్‌లో టాప్‌ టెన్‌లో ఓజీ ఏడో స్థానంలో ఉంది.  

PK.jpg

సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌ గ్లింప్స్‌ వదిలినప్పటి నుంచి ఉన్న క్రేజ్‌ సినిమా విడుదలై ఐదు రోజులు కావొస్తున్నా తగ్గలేదు. చంటి బిడ్డ నుంచి 60 ప్లస్‌ వయసున్న వారికిదాకా అందరిలోనూ ఓజీ ఫీవరే నడించింది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఓజీకి సంబంధించిన విశేషాలే. ఇన్‌స్టాగ్రామ్‌లో 300 రీల్స్‌ స్ర్కోల్‌ చేస్తే అందులో 260కి పైగా ఓజీ రీల్సే. అంతగా ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. పవన్‌ కల్యాణ్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఆశించారో దానిని సుజీత్‌ ఆడియన్స్‌ ముందు ఉంచారు. ఇందులో పవన్‌ లుక్‌, మ్యానరిజం, స్టైలింగ్‌, ఎలివేషన్స్‌, దానికి తమన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను ఓ రేంజ్‌ తీసుకెళ్తింది. అదే ఈ సినిమాకు ప్లస్‌ అయింది. పండగ సీజన్‌లో విడుదల చేయడం కూడా బాగా కలిసొచ్చింది.  త్వరలో ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను భారీగా నిర్వహించనున్నారనీ, దానికి పవన్‌ కూడా హాజరవుతారని తెలిసింది.

 
‘ఓజీ’ మరో ట్రీట్‌...

ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఓ ప్రత్యేక గీతంలో నటించారు. పలు కారణాల వల్ల ఆ పాటను సినిమా నుంచి తొలగించారు. దానిని మళ్లీ సినిమాలో పెట్టబోతునట్లు తాజా ఇంటర్వ్యూలో తమన్‌ తెలిపారు. 

Updated Date - Sep 29 , 2025 | 05:35 PM