Saiyaara OTT: ఓటీటీకి.. దేశాన్ని షేక్ చేసిన రొమాంటిక్ సినిమా.! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:04 PM
జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి వచ్చి సంచలనం సృష్టించిన హిందీ చిత్రం సయ్యారా.
సుమారు రెండు నెలల క్రితం జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి వచ్చి సంచలనం సృష్టించిన హిందీ చిత్రం సయ్యారా (Saiyaara). దాదాపు రూ.45 కోట్ల లోపు బడ్జెట్‌తో అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) హీరో హీరోయిన్లుగా యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా లవ్ చిత్రాల మాష్టర్ మోహిత్ సూరి (Mohit Suri) డైరెక్ట్ చేశాడు. ఓ అనామక చిన్న చిత్రం గా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వరద పారించింది. సుమారు రూ. 580 కోట్లను కొల్లగొట్టి ఈ యేడు బాలీవుడ్ సినిమాల టాప్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. స్టిల్ ఇప్పటికీ చాలా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోన్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంసిద్దమైంది.
వాణి బత్రా (అనీత్ పడ్డా) మహేశ్ అనే కుర్రాడితో ప్రేమలో ఉండి పెల్లి వరకు వెళుతుంది.. తీరా పెళ్లి చేసుకునే సమయానికి నాకు కేరీరే ముఖ్యమంటూ వాణిని వదిలేసి వెళ్లిపోతాడు దీంతో ప్రేమలో విఫలమైన యువతి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆపై తను చేసే రచనలు కూడా బంద్ చేస్తుంది.మరోవైపు సంగీతం అంటే ప్రాణం పెట్టే క్రిష్ కపూర్ ఎలాగైనా మ్యూజిక్‌లో పైస్తాయికి ఎదగాలని లక్ష్యంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంలో వాణిని కలిసిన కృష్ణ ఆమె రాసిన పాటలకు ఫిదా అవుతాడు ఆపై ఆమెతో ప్రేమలో పడతాడు.. కానీ వాణికి అల్జీమర్స్ తహా అనారోగ్య సమస్య ఉందని తెలుసుకున్న క్రిష్ వాణికి చేదోడు వాదోడుగా ఉంటాడు.
ఈక్రమంలో ఇరువురి తల్లిదండ్రులు రావడం, ఆపై జరిగే పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎడబాటు వస్తుంది. ఈ నేపథ్యంలో వారు చివరకు కలిశారా లేదా, వాణఙ అల్జీమర్స్ ఇష్యూ ఏమైంది, క్రిష్ సంగీతంలో రాణించాడా లేదా అనే పూర్తి ఎమోషనల్ కథనంతో సినిమా మ్యూజికల్ డ్రామాగా సాగుతుంది. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీ OTTలో కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్‌కు రానుంది. సినిమాను మళ్లీ చూడాలనుకునే వారు, థియేటర్లలో మిస్సయిన వారికి ఇది రొమాంటిక్ సమాచారం. అయితే ఇకటి రెండు సన్నివేశాల్లో ద్దులు, ఇంటిమేట్ సన్నివేశాలు ఇబ్బంది పెడుతాయి. పిల్లలలు లేకుండా ఈ సినిమా సయ్యారా (Saiyaara) చూడడం బెటర్.