Akkineni Venkat: 'శివ'ని వారందరూ కాదన్నారు.. చివరకు మా వద్దకు ఎలా వచ్చిందంటే
ABN, Publish Date - Aug 17 , 2025 | 08:26 PM
పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే.. ప్రేక్షకుడు చూసే ప్రతి సినిమా మీద తీసేవాడి పేరు రాసి ఉంటుంది.
Akkineni Venkat: పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే.. ప్రేక్షకుడు చూసే ప్రతి సినిమా మీద తీసేవాడి పేరు రాసి ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా ఆ సినిమా ఆ పేరు ఉన్నవారి వద్దకే చేరుతుంది. లేకపోతే ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా.. ఎన్నో స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ వద్దకు వెళ్లి, రిజెక్ట్ అయ్యి.. చివరకు ఖాళీగా ఉన్న ప్రొడక్షన్ హౌస్ వద్దకు రావడమేంటి.. ? ఆ కథను నమ్మి ఆ మేకర్స్ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ ను అందుకోవడం ఏంటి.. ? వింతగా ఉంది కదా. మరి ఆ సినిమా ఏంటి.. ? ఆ డైరెక్టర్ ఎవరు .. ? అనేది తెలుసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే ఈయనను తిట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా వెలుగొందాడు. ఇండస్ట్రీ చరిత్రలో నిలబడే సినిమాలను తెరకెక్కించాడు. ఆర్జీవీ మొదటి సినిమా శివ. ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన ఈ చిత్రం 1990 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున కెరీర్ ను తిరగరాసింది. అయితే ఇప్పుడంటే ఈ సినిమాను నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ, అప్పట్లో ఈ సినిమా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కంపెనీలే రిజెక్ట్ చేశాయట.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కొడుకు, నిర్మాత అయిన అక్కినేని వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివ ఎలా మొదలైంది అనే విషయాలను బయటపెట్టాడు. అసలు ఆర్జీవీ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదని, ఆ తరువాత స్క్రిప్ట్ వలన ఆయనే డైరెక్టర్ గా మారినట్లు చెప్పుకొచ్చాడు. 'ఆర్జీవీ మొదట శివ కథను పట్టుకొని రామోజీరావు గారి దగ్గరకు వెళ్ళాడట. ఆయన వర్మకు అనుభవం లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత సురేష్ ప్రొడక్షన్స్ దగ్గరకు వెళ్తే వాళ్ళు కూడా అనుభవం లేదని వద్దన్నారట. తరువాత మా దగ్గరకు వచ్చాడు. వర్మ వాళ్ల నాన్న కృష్ణంరాజు మా దగ్గర సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఒకరోజు ఆయన మా అబ్బాయి ఏదో స్క్రిప్ట్ రాసాడట. ఖాళీగా ఉంటే ఒకసారి విను అని చెప్తే ఓకే అన్నాను.
వర్మ చెప్పిన స్టోరీ నాకు నచ్చింది. ఆయన చెప్పిన విధానం చాలా బావుంది. అసలు మొదట వర్మ సినిమా స్క్రిప్ట్ రాద్దామని వచ్చాడు. ఆ తరువాత నేరేషన్ బట్టి డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు. ఇక కొన్ని రోజుల తరువాత వర్మను రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకెళ్ళాను. కథ విన్నాకా ఆయన చాలా డిప్రెస్సెడ్ గా ఫీల్ అయ్యాడు. ఇదేదో ఆర్ట్ ఫిల్మో, కమ్యూనిస్ట్ ఫిల్మ్ లా ఉందని అన్నారు. అక్కడే శివ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాము. అప్పుడే రావు గారి ఇల్లు సినిమా షూటింగ్ జరగడం, అందులోనే అందరి పరిచయాలు.. నాగార్జునతో స్నేహం అలా జరిగాయి. ఈ వయస్సులో అలాంటి నిర్ణయం తీసుకోమంటే నేను రిస్క్ చేసేవాడిని కాదు. ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి అవకాశం ఇవ్వడం కష్టం. ఇప్పుడు అలాంటి సినిమాలు తీయడం కష్టం. చాలా ఫిక్షనల్ గా తీశారు' అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే శివ రీ రిలీజ్ కానుంది. మరి ఈసారి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
Monday Tv Movies: సోమవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
AR murugadoss: ఫెయిల్యూర్ లెజెండ్స్‌పై ప్రభావం చూపదు..