AR murugadoss: ఫెయిల్యూర్‌ లెజెండ్స్‌పై ప్రభావం చూపదు..

ABN , Publish Date - Aug 17 , 2025 | 07:25 PM

ఎ.ఆర్‌ మురుగదాస్‌ కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌కి సుపరిచితుడే. ‘గజిని’, ‘తుపాకి’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు.

AR murugadoss

ఎ.ఆర్‌ మురుగదాస్‌ (AR murugadoss) కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌కి సుపరిచితుడే. ‘గజిని’, ‘తుపాకి’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా  తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’.  సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ అగ్ర దర్శకుల కొత్త సినిమాల పరాజయంపై మురుగదాస్‌ను అడగగా ఆయన సమాధానమిచ్చారు. అంతే కాదు సల్మాన్‌ఖాన్‌ హీరోగా తాను తెరకెక్కించిన ‘సికందర్‌’ ఫెయిల్యూర్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. హృదయానికి దగ్గరైన కథను అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని చెప్పారు. ఆ సినిమా నిర్మాణ దశలో కథ మారిందని, ఆ మూవీ పరాజయానికి బాధ్యుడిని కాదని తెలిపారు. ప్రస్తుతం ‘తుపాకి’ సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు మురుగదాస్‌ తెలిపారు.


 ALSO READ: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది

అలాగే శంకర్‌ (Shankar) తెరకెక్కించిన ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’, మణిరత్నం (Mani ratnam)రూపొందించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రాల ప్రస్తావన రాగా.. ఒకట్రెండు సినిమాలు ఫెయిల్‌ అయినంత మాత్రాన లెజెండ్స్‌పై ప్రభావం పడదు అన్నారు. రూ.100 కోట్ల కలెక్షన్లు తెచ్చు దర్శకులు ప్రేక్షకులకు వినోదం మాత్రమే పంచుతారని, తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్‌ చేస్తారని ఆయన సమాధానం ఇచ్చారు.

ALSO READ: Kasarla Shyam: కాసర్ల శ్యామ్‌.. నేషనల్ అవార్డు సీక్రెట్ అదే

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ చూశారా

The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ ఫస్ట్ మూవీ గ్లింప్స్‌

Maareesan: ఓటీటీకి వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా .. ఎందులో చూడొచ్చంటే

Updated Date - Aug 17 , 2025 | 08:30 PM