Kaantha First Spark: అదిరిపోయిన కాంత ఫస్ట్ స్పార్క్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:58 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రాల్లో కాంత(Kaantha)సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
Kaantha First Spark: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రాల్లో కాంత(Kaantha)సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే కాంత చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈపాటికే కాంత రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ చివరకు నవంబర్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాంత ఫస్ట్ స్పార్క్ అనే పేరుతో ఒక చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కూడా టీజర్ లో చూపించినట్లు సముద్రఖనిక, దుల్కర్ కు మధ్య ఉన్న వైరాన్ని చూపించారు.
కాంతలో దుల్కర్ హీరోగా.. సముద్రఖని డైరెక్టర్ గా కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య ఈగో క్లాష్ వలన హీరోనే డైరెక్టర్ గా మారి సినిమా తీస్తాను అని చెప్పడం.. దాన్ని జీర్ణించుకోలేని డైరెక్టర్.. హీరోను చంపుతాను అని పగతో తిరగడం లాంటి షాట్స్ చూపించారు. మరి హీరో - డైరెక్టర్ మధ్య వచ్చిన వివాదం ఏంటి.. ? దీనికి, హీరోయిన్ కి సంబంధం ఏంటి ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జాను చంతర్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా అదిరిపోయింది. ఇకపోతే కాంత ట్రైలర్ ను నవంబర్ 6 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో దుల్కర్, రానా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Supreme Court: సరసమైన ధరలు లేకపోతే హాళ్లు ఖాళీగా అయిపోతాయి