Globetrotter: సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. మాములుగా లేదుగా

ABN , Publish Date - Nov 04 , 2025 | 05:38 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి(Rajamouli) మూవీ మొదలయినప్పటి నుంచీ ఆ సినిమా కోసం మూవీబఫ్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పట్లో వెలుగు చూడకపోయినా సరే, ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Globetrotter

Globetrotter: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి(Rajamouli) మూవీ మొదలయినప్పటి నుంచీ ఆ సినిమా కోసం మూవీబఫ్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పట్లో వెలుగు చూడకపోయినా సరే, ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఏ అంశమైనా నవంబర్ లోనే చెబుతానని ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగానే తెలిపారు రాజమౌళి. ఇంతకూ నవంబర్ ప్రత్యేకత ఏంటి? నవంబర్ 15వ తేదీన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ బిగ్ ఈవెంట్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరగనుంది. ఈ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని రాజమౌళి, చిత్ర నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ ప్లాన్ చేశారు. నవంబర్ 15వ తేదీన మహేశ్ తండ్రి నటశేఖర కృష్ణ వర్ధంతి. అందువల్లే ఆ తేదీని ఎంచుకున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృష్ణ గతించి మూడేళ్ళవుతోన్నా, ఆయన జ్ఙాపకాలు ఫ్యాన్స్ మదిలో పదిలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్- రాజమౌళి మూవీకి సంబంధించి 'గ్లోబల్ ట్రాటర్' పేరుతో ఈవెంట్ ప్లాన్ చేయడం మరింత విశేషంగా మారింది.


'గ్లోబల్ ట్రాటర్' అంటే విశేషంగా ప్రపంచమంతటా పర్యటించేవాడు అని అర్థం. ఈ సినిమాలో హీరో కేరెక్టర్ అలాంటిదేనని వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో అనువదిస్తారనీ తెలుస్తోంది. ఆ తీరున ఈ మూవీ ఇంగ్లిష్ వర్షన్ కు 'గ్లోబల్ ట్రాటర్' అన్న టైటిల్ నిర్ణయించారనీ వినికిడి. ఇదిలా ఉంటే ఈ మూవీలో వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యం కూడా ఉంటుందని, అందువల్ల సినిమాకు 'వారణాసి' అన్న టైటిల్ పెట్టనున్నారనీ విశేషంగా వినిపించింది. అయితే అప్పట్లో ఫ్యాన్స్ ఆ టైటిల్ కు పెద్దగా స్పందించలేదు. పైగా ఈ టైటిల్ తో ఓ చిన్న సినిమా రిజిస్టర్ చేయించుకుంది - కాబట్టి, సదరు నిర్మాతల నుండి 'వారణాసి' అన్న పేరు కోసం అనుమతి తీసుకోవలసి ఉంటుందనీ అంటున్నారు... ఏది ఏమైనా నవంబర్ 15న ఆర్.ఎఫ్.సి.లో జరిగే ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని విశేషంగా వినిపిస్తోంది.


మహేశ్-రాజమౌళి మూవీకి సంబంధించిన ఏ అంశమైనా ఇక ముందుగా 'జియో హాట్ స్టార్'లో వెలుగు చూస్తుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి హాట్ స్టార్ తో మేకర్స్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అందువల్లే 'గ్లోబల్ ట్రాటర్'కు సంబంధించిన విశేషాలను జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఓ సినిమా మేకింగ్ లో ఉండగానే, దానికి సంబంధించిన విశేషాలను ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ 'గ్లోబల్ ట్రాటర్' ఈవెంట్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో వంద అడుగుల ఎల్ఈడీ స్క్రీన్ రూపొందిస్తున్నారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్ లో దాదాపు లక్షమంది పాలుపంచుకుంటారని సమాచారం. అందువల్ల వారందరికీ వేదికపై జరిగే అంశాలన్నీ క్షుణ్ణంగా తెలియడానికి ఇంత పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇలా ప్రతి అంశం ఓ విశేషంగా మారి మహేశ్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. జియో హాట్ స్టార్ ను ట్యాగ్ చేస్తూ ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. అప్డేట్ కోసమా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను జియో హాట్ స్టార్ నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Kaantha First Spark: అదిరిపోయిన కాంత ఫస్ట్ స్పార్క్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Pithapuramlo: మహేష్‌చంద్ర దర్శకత్వంలో ‘పిఠాపురంలో’

Updated Date - Nov 04 , 2025 | 05:38 PM