Akhil Akkineni: నా జీవితంలో అత్యుత్తమ రోజు..
ABN, Publish Date - Jun 27 , 2025 | 09:51 PM
అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) ఈ మధ్యనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే.
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) ఈ మధ్యనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. జూన్ 6 న జైనబ్ (zainab ravdjee) మెడలో అఖిల్ మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం అంత గ్రాండ్ గా జరగకపోయినా సింపుల్ గా అద్భుతంగా జరిగింది. జైనబ్.. అఖిల్ కన్నా 8 ఏళ్ళు పెద్ద. నాగ చైతన్య - శోభితా వివాహ వేడుకల్లో నాగ్.. అఖిల్ - జైనబ్ ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఈ జంట సోషల్ మీడియాలో అడోరబుల్ కపుల్ గా మారిపోయింది.
ఇక తాజాగా అఖిల్.. తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లి సమయంలో కొన్ని ఫోటోలు బయటకు రాగా మరికొన్ని ఫోటోలను అఖిల్ షేర్ చేసాడు. 'జూన్ 6.. నా జీవితంలోని అత్యుత్తమ రోజు నుండి కొన్ని క్షణాలను పంచుకోవాలని నా హృదయం భావించింది' అంటూ అఖిల్ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ఇక పెళ్లి ఫోటోలలో జంట చూడముచ్చటగా కనిపించారు. వైట్ అండ్ వైట్ పంచెలో అఖిల్.. అచ్చతెలుగు పెళ్లికూతురుగా జైనబ్ ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక అఖిల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ మధ్యనే శ్రీలీల తప్పుకుంది. ఆ స్థానంలోకి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని సమాచారం. పరువు హత్యల నేపథ్యంలో లెనిన్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. లెనిన్ సినిమాను అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఒక కీలక పాత్రలో కూడా నాగ్ ఇందులో నటిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత అఖిల్ నుంచి వస్తున్న మొదటి సినిమా.. మరి జైనబ్ లక్ కలిసొచ్చి అయ్యగారు హిట్ అందుకుంటారేమో చూడాలి.
Tollywood: ఇద్దరు మెగాస్టార్ల మధ్య చేతులు కట్టుకొని నిలబడిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా