Tollywood: ఇద్దరు మెగాస్టార్ల మధ్య చేతులు కట్టుకొని నిలబడిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:51 PM

ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురిని గుర్తుపట్టారా.. ? అంటే ఓ, మాకెందుకు తెలియదు.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amithabh Bachchan) కదా..

Bandla Ganesh

Tollywood: ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురిని గుర్తుపట్టారా.. ? అంటే ఓ, మాకెందుకు తెలియదు.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amithabh Bachchan) కదా.. అరెరే మధ్యలో అమాయకమైన ముఖంతో నవ్వుతూ చేతులు కట్టుకున్న అతను ఎవరబ్బా అనే డౌట్ వచ్చిందా.. ? అంతగా ఆలోచించనవసరం లేదు.. సరిగ్గా చూస్తే ఆ వ్యక్తి బండ్ల గణేష్ (Bandla Ganesh) అని ఇట్టే చెప్పొయొచ్చు. అవును చిరు, అమితాబ్ ల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడింది బండ్ల గణేషే.


స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బండ్ల గణేష్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత నెమ్మదిగా స్టార్ కమెడియన్స్ పక్కన నటిస్తూ కమెడియన్ గా మారాడు. కామెడీ పాత్రలే కాకుండా హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్, మాస్టర్ లాంటి సినిమాలు బండ్లకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టాయి. ఆ తరువాత నెమ్మదిగా వ్యాపారాన్నీ ప్రారంభించి కోట్లు గడించాడు. అంతేకాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించాడు.


అలా కమెడియన్ బండ్ల గణేష్ కాస్తా.. నిర్మాత బండ్లన్నగా మారాడు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో లాంటి సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. సినిమాలను నిర్మిస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకొని బయటకు వచ్చాడు. ఆ తరువాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్లన్న నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తనకు నచ్చిన అంశాల గురించి, సినిమాల గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.


తాజాగా బండ్ల గణేష్ త్రో బ్యాక్ ఫోటోను బండ్ల గణేష్ అభిమానులతో పంచుకున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో బండ్ల గణేష్ ఒక స్టూడెంట్ గాకనిపించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే మాస్టర్ సెట్స్ కు అమితాబ్ వచ్చాడు. అప్పుడే ఇద్దరు మెగాస్టార్ లతో కలిసి బండ్లన్న ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఆ ఫోటో మీద తమ్ముడు బండ్ల గణేష్ కి ప్రేమతో మీ చిరంజీవి అని రాసి ఉండడం విశేషం. మాస్టర్ షూటింగ్ అని బండ్ల క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Junior Teaser: ఆసక్తికరంగా జూనియర్ టీజర్.. జెనీలియా హైలైట్

Updated Date - Jun 27 , 2025 | 08:51 PM