సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jai Akhanda: అఖండ2 విడుద‌ల వేళ.. అదిరిపోయే స‌ర్‌ఫ్రైజ్! ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్‌

ABN, Publish Date - Dec 03 , 2025 | 02:45 PM

అఖండ 2కు సైతం సీక్వెల్ ఉండబోతున్నట్టు సమాచారం. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో 'జై అఖండ' అనే సిల్వర్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేయడంతో అదే పేరుతో ఈ సీరిస్ లో మూడో సినిమా వస్తుందనే ప్రచారం జోరందుకుంది.

Jai Akhanda - Jai Balayya

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్... ఈ రెండు పేర్లు కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. 'సింహా, లెజెండ్, అఖండ' వంటి మూడు బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'అఖండ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతున్న ఈ సమయంలో, మేకర్స్ ఊహించని విధంగా మరో మెగా ట్విస్ట్‌ను రివీల్ చేసి సినీ వర్గాలను షాక్‌కు గురి చేశారు. 'అఖండ -2' విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో, సినిమాకు సంగీతం అందిస్తున్న ఎస్. ఎస్. తమన్ తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో, చిత్ర బృందం అంతా ఫైనల్ చెకింగ్స్ తర్వాత రిలాక్డ్స్ గా కనిపిస్తున్నారు. కానీ, వారి వెనుక ఉన్న స్క్రీన్‌పై 'జై అఖండ' అనే పదాలు స్పష్టంగా కనబడ్డాయి.


సాధారణంగా, ఒక సినిమా విడుదల కాకముందే తదుపరి సీక్వెల్ టైటిల్‌ను ఈ విధంగా ప్రకటించడం అనేది అరుదైన విషయం. కానీ, బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే, ఈ పిక్ ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయింది. 'జై అఖండ' అనేది 'అఖండ' సిరీస్‌లో రాబోయే మూడవ భాగం 'అఖండ 3' టైటిల్ అని ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. గత కొద్ది వారాలుగా 'అఖండ 3' ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, సెన్సార్ టీమ్‌కు పంపిన కాపీలో 'అఖండ 2' ముగింపులో 'జై అఖండ' కు సంబంధించిన ఎలాంటి అధికారిక లింక్ కానీ, సీక్వెల్ ప్రకటన కానీ లేదని తెలిసింది.


బాలకృష్ణ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి (Aadi Pinisetty), కబీర్ దుహాన్ సింగ్, పూర్ణ (Purna) వంటి భారీ తారాగణం ఉంది. సినిమాను 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయబోతున్నారు. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్... ఇవన్నీ కలిసి 'అఖండ 2 తాండవం' ఒక మెగా ఓపెనింగ్ సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు సినిమా ప్రీమియర్స్ షోస్ కు ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 600 టిక్కెట్ రేట్ పెట్టడం, పది రోజులు పాటు సింగిల్ స్క్రీన్ రూ. 75, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 100 లు చొప్పున టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో ఈ యేడాది అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసే తెలుగు సినిమాగా 'అఖండ -2 తాండవం' నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఇప్పుడు అభిమానులంతా దీని థర్డ్ పార్ట్ 'జై అఖండ' గురించిన ఊహాగానాలు చేస్తున్నారు.

Also Read: Raja Saab: రాజా సాబ్ నుంచి బొమన్ సాబ్.. ఫ‌స్ట్ లుక్ అదిరింది

Also Read: Anumana Pakshi: అనుమాన పక్షి.. వచ్చేస్తున్నాడు

Updated Date - Dec 03 , 2025 | 06:52 PM