Raja Saab: రాజా సాబ్ నుంచి బొమన్ సాబ్.. ఫ‌స్ట్ లుక్ అదిరింది

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:38 PM

ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ‘రాజాసాబ్’ లో బొమన్ ఇరాని పాత్ర లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

Raja Saab

ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాజాసాబ్ (RajaSaab). టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. జనవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో అతీంద్రియ శక్తుల పరిశోధకుడిగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాన్(Boman Irani) కీలక పాత్ర పోషిస్తున్నారు.

Boman Irani

మంగళవారం ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ విడుదల చేసింది. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్లోన్ మూవీగా నిలిచిపోయేలా దర్శకుడు మారుతి 'రాజా సాబ్‌ను రూపొందిస్తున్నాడు. మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:38 PM