Akhanda 2: ప్రేక్షకులకు.. గుడ్ న్యూస్! భారీగా.. తగ్గనున్న టికెట్ రేట్లు! కానీ
ABN, Publish Date - Dec 30 , 2025 | 01:40 PM
నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా టిక్కెట్ రేట్లను తెలంగాణలో తగ్గిస్తున్నారు. జనవరి 1 నుండి సింగిల్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లోనూ టిక్కెట్ రేట్లు తగ్గిస్తున్నట్టు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు 'అఖండ 2' (Akhanda 2) మేకర్స్ నూతన సంవత్సర కానుకను అందిస్తున్నారు. అయితే ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాబోతోంది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ 2' అనివార్య పరిస్థితులలో వాయిదా పడి, అదే నెల 12న జనం ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా... హిందుత్వ వాదులు, బాలకృష్ణ అభిమానులు 'అఖండ 2'ను ఆదరిస్తూనే ఉన్నారు. బయట ఉన్న టాక్ కు సినిమా కలెక్షన్స్ కు పొంతన లేకుండా ఉంది. కొన్ని చోట్ల ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే బ్రేకీవెన్ కు చేరుకుంది. కొన్ని చోట్ల దరిదాపులకు వచ్చేసింది.
ఇదే సమయంలో తెలంగాణలో 'అఖండ 2' సినిమాను సింగిల్ స్క్రీన్స్ లో కేవలం రూ. 50, రూ. 80, రూ. 105 లకు దీనిని ప్రదర్శించబోతున్నారు. అలానే మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 150 లుగా నిర్ణయించారు. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు (Dil Raju) పంపిణీ చేశారు. సంక్రాంతి సీజన్ మూవీస్ లలో మొదటిదైన 'ది రాజా సాబ్' (The Raja Saab) 9వ తేదీ విడుదల కాబోతోంది. సో... 8వ తేదీ వరకూ తక్కువ రేట్లకే 'అఖండ 2'ను వీక్షించే అవకాశాన్ని దిల్ రాజు కల్పించినట్టయ్యింది.
Also Read: Star Boy Siddhu: హీరోగా ఆరు... సితారలో మూడు!
Also Read: SARASWATHI: వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టోరియల్ డెబ్యూ కు గుమ్మడికాయ కొట్టేశారు!