Little Hearts: చిన్న మార్పులతో.. హిట్టు సినిమాకు సీక్వెల్
ABN, Publish Date - Oct 02 , 2025 | 04:32 PM
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లిటిల్ హార్స్ట్’. సినిమాలో కొన్ని అదనపు సీన్స్‌తోపాటు ఓ పెద్ద సర్‌ప్రైజ్‌నే మేకర్స్ ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లిటిల్ హార్స్ట్’ (Little hearts) . మౌళి తనూజ్, శివాని నగరం జంటగా నటించిన ఈ సినిమా దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ర్టీమ్ అవుతోంది. సినిమాలో కొన్ని అదనపు సీన్స్‌తోపాటు ఓ పెద్ద సర్‌ప్రైజ్‌నే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. (Little Hearts’ Sequel)
‘లిటిల్ హార్ట్స్ 2’ పేరుతో వచ్చే ఈ సినిమా కథ, లీడ్ పెయిర్ సిబ్లింగ్స్, లవ్ ట్రాక్ చుట్టూ తిరగనుందని తెలిపారు. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పలేదు. మొదటి భాగంలో మౌళి తమ్ముడు పాత్ర పోషించిన సాయి మార్తాండ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్‌గా ధీరారెడ్డి ఎంపికయ్యారు. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయని చెప్పారు.