G2 Movie: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. గూఢచారి 2 రిలీజ్ డేట్ చెప్పారు

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:02 PM

కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2 సినిమాను ప్రకటించాడు.

G2

G2 Movie: కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గూఢచారికి సీక్వెల్ గా గూఢచారి 2 సినిమాను ప్రకటించాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ మేకర్స్ ఇచ్చింది లేదు. అయితే సడెన్ గా జీ2 రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో జీ2 రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆరు దేశాల్లో 150 రోజులు షూటింగ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా 23 సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. మే 1 న జీ2 సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో అడివి శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Napoleon Team: ఆనంద్ రవి దర్శకత్వంలో కొత్త సినిమా

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. 

Updated Date - Aug 04 , 2025 | 07:04 PM