Abhinaya Krishna: అదిరే అభి సెకండ్ మూవీ 'కామాఖ్య'... పోస్టర్ రిలీజ్ చేసిన సీతక్క
ABN, Publish Date - Dec 06 , 2025 | 07:07 PM
'జబర్దస్త్' ఫేమ్ అదిరే అభి దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'కామాఖ్య'. సమైరా, సముతిరకని, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
జబర్దస్త్ కమెడియన్స్ వరుసగా దర్శకులు అయిపోతున్నారు. అయితే... మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా... అదిరే అభి (Adire Abhi) ఈ విషయంలో కాస్తంత ముందున్నాడు. అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'చిరంజీవా' (Chiranjeeva) విడుదల కావడానికి చాలా సమయమే పట్టింది. ఆ ప్రాజెక్ట్ తో బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నాడు అదిరే అభి ఉరఫ్ అభినయ కృష్ణ (Abhinaya Krishna). రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా నటించిన 'చిరంజీవా' సినిమా ఇటీవలే ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇదే యేడాది జులై నెలాఖరులో అభినయ కృష్ణ తన సెకండ్ డైరెక్టోరియల్ వెంచర్ గా 'కామాఖ్య' (Kaamakhya) ను మొదలు పెట్టాడు. వడ్డేపల్లి శ్రీవాణీనాధ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమైరా, సముతిరకని (Samutirakani), అభిరామి (Abhirami) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ థ్రిలింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించి, టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్ మూవీ ఇదని, ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని అభినయ కృష్ణ చెప్పారు. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గ్యాని సంగీతం సమకూర్చుతుండగా, రమేశ్ కుశేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read: Annagaru Vostaru Trailer: అన్నగారు.. బాగా నవ్వించడానికి సిద్దమయ్యినట్లున్నారు
Also Read: Nandamuri Kalyan Chakravarthy: 35 యేండ్ల తర్వాత సినిమాల్లోకి.. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీ ఎంట్రీ