Annagaru Vostaru Trailer: అన్నగారు.. బాగా నవ్వించడానికి సిద్దమయ్యినట్లున్నారు
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:00 PM
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) నటించిన వా వాతియార్ లీగల్ కేసుల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే.
Annagaru Vostaru Trailer: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) నటించిన వా వాతియార్ లీగల్ కేసుల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. నిర్మాత KE జ్ఞానవేల్ రాజా.. ఒకరి దగ్గర అప్పు చేసి ఇప్పటివరకు తీర్చకపోవడంతో.. సదురు వ్యక్తి ఈ సినిమాను ఆపాలని కోర్టుకెక్కాడు. ఈ విషయం అందరికీ తెల్సిందే. అయినా కూడా మేకర్స్ అవన్నీ పట్టించుకోకుండా డిసెంబర్ 12 న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక వా.. వాతియార్ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు (Annagaru Vostaru) అనే పేరుతో రిలీజ్ కానుంది.
నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా అన్నగారు వస్తారు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కథ ఏంటి అనేది రివీల్ చేయకుండా నటీనటులను చూపించినట్లు ఉంది. రాజకీయాలు, సినిమాల నేపథ్యంలో తెరకెక్కిన కథలా అనిపిస్తుంది.
తమిళ్ లో ఎంజీఆర్ ని చూపిస్తే.. తెలుగులో ఎన్టీఆర్ ని చూపించడం విశేషం. అన్నగారు అని పేరు పెట్టినందుకు పెద్ద ఎన్టీఆర్ ఆశీస్సులతో అని ట్రైలర్ ని మొదలుపెట్టడం అద్బుతమని చెప్పొచ్చు. రంగస్థల నటుడు మనవడు కావడంతో హీరో సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించారు. ఇక ఇంకోపక్క పోలీస్ గా లంచాలు తీసుకొనే వ్యక్తిగా చూపించారు. ట్రైలర్ ని బట్టి అన్నగారు అందరినీ నవ్వించడానికి వస్తున్నారు అని తెలుస్తోంది. ఇక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో అన్నగారు అంటూ వచ్చే మ్యూజిక్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మరి నిర్మాత ఈ లీగల్ సమస్యలు అన్ని పరిష్కరించి అన్నగారిని అనుకున్న టైమ్ కి దింపుతారో లేదో చూడాలి.