Preity Mukhundhan: కన్నప్ప కోసం.. శారీరకంగా ఎంతో కష్టపడ్డా
ABN, Publish Date - Jul 04 , 2025 | 09:50 AM
ఓం భీం భుష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించింది తమిళ ముద్దుగమ్మ ప్రీతి ముకుందన్.
శ్రీ విష్ణు ఓం భీం భుష్ (Om Bheem Bush) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించింది తమిళ ముద్దుగమ్మ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ఆపై కెవిన్‌తో స్టార్ చిత్రంతో నటి గాను గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇటీవల కన్నప్ప (Kannappa) సినిమాతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆ సినిమాలో పుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో చివరకి వరకు కనిపించిన ఈ భామ నటనతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మూవీలోని పాటలు అందులోని డ్రెస్సింగ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చాలాకాలం సోషల్ మీడియాను షేక్ చేసింది కూడా.
ఇదిలాఉంటే.. సినిమా టీజర్ రిలీజ్ సమయంలో ఏడాది క్రితం కనిపించిన ఈ చెన్నై చిన్నది ఆపై మళ్లీ ఇంతవరకు కనిపించిన దాఖాలాలు లేవు. దేశమంతా నిర్వహించిన సినిమా ఈవెంట్లలో ప్రధానంగా హైదరాబాద్ ఫ్రీ రిలీజ్‌లోనూ హీరో, పలువురు నటులు సందడి చేసినప్పటికీ హీరోయిన్ దర్శణం ఇవ్వలేదు. దాంతో మేకర్స్‌తో ఎదో ఇష్యూలు వచ్చాయని న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల కావడం మంచి విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి.
ఈ సందర్భంగా అనేక మంది ప్రీతి నటనను మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తుతుండడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాంతో ప్రీతి (Preity Mukhundhan) అందరికీ థ్యాంక్స్ చెబుతూ తన అనుభవాలను చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది.
ఆరు నెలలు ఆ పాత్ర కోసం శారీరకంగా ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు వచ్చిన ఫలితం ఎతో గొప్పగా ఉందని తెలిపింది. అయితే అందులో కన్నప్ప సినిమాను, నటుల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా తన గురించి మాత్రమే చెప్పడంతో ఆ యూనిట్‌కు, ప్రీతి మధ్య సమ్‌థింగ్ ఏదో జరిగిందనే వార్తలకు బలం చేకూరిన్టట్లైంది.
అయితే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కన్నప్ప (Kannappa) సినిమా తరహా దుస్తులను ధరించి రకారకాల భంగిమలతో హోయలు పోతూ హంగామా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండగా టాలీవుడ్, బాలీవుడ్ ఈ అమ్మడికి మరిన్ని ఛాన్సలు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రీతి కొత్త ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.