Ashika Ranganath: సీనియర్లైతే.. ఏంటి! టాలీవుడ్ లెక్కలు.. మార్చేస్తున్న కన్నడ బ్యూటీ!
ABN, Publish Date - Dec 21 , 2025 | 09:54 AM
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల కొరత అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రతి కొత్త సినిమాకీ, సినీ ప్రేమికులు మరో కొత్త ముఖం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల కొరత అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రతి కొత్త సినిమాకీ, సినీ ప్రేమికులు మరో కొత్త ముఖం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టే వారు చాలా మందే ఉన్నా, నిలదొక్కుకునే వాళ్లు కొందరే. అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్రెండ్ ఉంది. కొత్త తరం హీరోయిన్లు ఎక్కువ మంది యంగ్ హీరోస్ పక్కన నటించడానికే మొగ్గు చూపుతారు.
ఎందుకో తెలీదు గానీ, తమ కెరీర్ ఆరంభంలోనే సీనియర్ హీరోస్ సరసన నటించాలంటే కొందరు హీరోయిన్లు వెనుకంజ వేస్తారు. చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా, బిజీగా ఉన్నామని చెప్పి తప్పించుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. బహుశా, ఆడియన్స్‌లో తమ ఇమేజ్ దెబ్బతింటుందేమో, లేదంటే యంగ్ జనరేషన్ కనెక్ట్ అవ్వరనే భయం కావచ్చు. కానీ, ఇప్పుడు ఈ పాత లెక్కలన్నిటినీ మార్చేస్తూ, టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తోంది కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath).
కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన అమిగోస్ (Amigos) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఆ వెంటనే, కింగ్ నాగార్జున (Nagarjuna) సరసన నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో తన గ్లామర్ షోతో పాటు, నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నాక, ఆషికాకు ఆఫర్స్ వెంటనే క్యూ కడతాయనుకుంటే కొద్దిగా వెనకబడింది. అయితే, ఆమె అందుకున్న తదుపరి అవకాశాలే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్. అమ్మడు ఎంచుకుంటున్న సినిమాలు అందరికీ పెద్ద షాకే ఇస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) సినిమాలో ఆషికా మెయిన్ లీడ్‌గా నటిస్తోంది. ఇది మాములు విషయం కాదు. మెగాస్టార్ లాంటి లెజెండరీ హీరో సినిమాలో ఛాన్స్ అంటే ఆషికా ఎంత లక్కీనో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగానే, తాజాగా మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulu Vignapthi) సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. వరుసగా ముగ్గురు సీనియర్ హీరోల సినిమాల్లో మెయిన్ లీడ్‌గా ఛాన్స్ కొట్టేయడం అనేది ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది.
ఆషికా వరుసగా సీనియర్ హీరోల సినిమాలనే ఎంచుకోవడంపై ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రెస్ మీట్‌లో ఆమెకు ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తిని పెంచింది. ఎటువంటి దాపరికాలు లేకుండా, సీనియర్ హీరోలతో సినిమా చేయడంలో తప్పేంటి? అంటూ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్ వెనుక ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. సీనియర్ హీరోల సినిమాలలో నటించడం వలన కెరీర్‌కు ఎటువంటి నష్టం లేదని, పైగా వారి అనుభవం, స్టార్‌డమ్ తమకు మరింత ప్లస్ అవుతుందని ఆమె గట్టిగా నమ్ముతోంది.
ఈ ఓపెన్ స్టేట్‌మెంట్ ఆమె కాన్ఫిడెన్స్‌ను పెంచడంతో పాటు, ఆమె కెరీర్‌పై ఉన్న కమిట్‌మెంట్‌ను కూడా చూపిస్తోంది. ఆషికా రంగనాథ్ ప్రస్తుతం తెలుగు చిత్రాలతో పాటు, కన్నడ సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది. సినిమాల పరంగానే కాదు, సోషల్ మీడియాలోనూ తరచుగా అప్‌డేట్స్ ఇస్తూ యూత్ అటెన్షన్‌ను బాగానే గ్రాబ్ చేస్తోంది. మెగాస్టార్, రవితేజ వంటి దిగ్గజాల సరసన నటిస్తున్న ఈ కన్నడ బ్యూటీ, టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుంటుందో, ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆమె కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో వేచి చూడాలి.