Actor Praveen: నేను హీరోలా ఫీల్ అవ్వడం లేదు..
ABN , Publish Date - Aug 06 , 2025 | 09:21 PM
కమెడియన్ గా కెరీర్ ను ప్రారభించిన నటుడు ప్రవీణ్ (Praveen) కొద్దికొద్దిగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా మారాడు. ఇక ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి హీరోగా కూడా మారాడు.
Actor Praveen: కమెడియన్ గా కెరీర్ ను ప్రారభించిన నటుడు ప్రవీణ్ (Praveen) కొద్దికొద్దిగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా మారాడు. ఇక ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి హీరోగా కూడా మారాడు. ప్రవీణ్ హీరోగా హర్ష చెముడు టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం బకాసుర రెస్టారెంట్ (Bakasura Restaurant) . కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌జే శివ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
బకాసుర రెస్టారెంట్ సినిమా ఆగస్టు 8 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నటుడు ప్రవీణ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. 'ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్ ఎలా ఫుల్‌ఫిల్ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుందని' చెప్పుకొచ్చాడు.
ఇక మొదటిసారి హీరోగా నటిస్తున్నారు ప్రెజర్ ఫీల్ అవ్వడం లేదా అన్న ప్రశ్నకు ప్రవీణ్ మాట్లాడుతూ.. ' నిజం చెప్పాలంటే ఇది కొంచెం బరువే. పర్‌ఫార్మెన్స్ వైజ్ నాది రెగ్యులర్ పాత్ర కాదు. కథలో హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది. అయితే సినిమాను దర్శకుడు ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. అయితే సినిమాను మంచి ప్రమోషన్‌తో బయటికి తీసుకరావాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో నాకు సినీ పరిశ్రమలోని అందరూ సహకరిస్తున్నారు.
కమెడియన్‌గా హీరోగా మారితే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయోనని అంటుంటారు. అలాంటిదేమీ లేదు. అసలు నేను హీరోగా ఫీలయితే అలాంటి ఫీలింగ్ అందరిలో వస్తుంది. నేను ఓ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాననే భావనలో మాత్రమే ఉన్నాను .ప్రస్తుతం నేను విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార చిత్రాలతో బిజీగా ఉన్నాను. నాకు దర్శకుడి ఎలాంటి పాత్రను ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ముందు ముందు మంచి లీడ్ రోల్స్ లో నటించాలని ఉందని' తెలిపాడు. మరి ఈ సినిమాతో ప్రవీణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Vivek Agnihotri: నేను అక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తా.. నన్నెవరు ఆపుతారో చూస్తా
Bun Butter Jam Movie: తెలుగులోనూ వస్తున్న 'బన్ బటర్ జామ్’