Tollywood: అభినవ్ మణికంఠ.. 'బొమ్మ హిట్టు'
ABN, Publish Date - Dec 20 , 2025 | 05:38 PM
బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. అతని తాజా చిత్రం 'బొమ్మ హిట్టు' షూటింగ్ శనివారం మొదలైంది.
చైల్డ్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ (Abhinav Manikantha) హీరోగా నటిస్తున్న సినిమా 'బొమ్మ హిట్టు' (Bomma Hittu). రాజేశ్ గడ్డం ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం మొదలైంది.
అనంతరం హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ, 'హీరోగా నాకిది రెండో సినిమా. ఫస్ట్ మూవీ వర్క్ మరోపక్క జరుగుతోంది. నేను నటించిన 'ర్యాంబో ఇన్ లవ్' వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 'బొమ్మ హిట్టు' సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సిచ్యువేషనల్ కామెడీతో వినోదాన్ని అందిస్తుంది. ఫన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఇందులో ఉంది' అని అన్నారు. ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కు రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని రాజేశ్ గడ్డం చెప్పారు.
హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో పాటు తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని నిర్మాత సంధ్యారాణి అన్నారు. ఈ సినిమాలో తాను హీరో తండ్రిగా నటిస్తున్నానని మురళీధర్ గౌడ్ చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో హీరోయిన్ పూజ తో పాటు హైపర్ ఆది, జబర్దస్త్ అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rajamouli: సినిమాలకు రాజమౌళి గుడ్ బై..
Also Read: NTR: వార్ 2 డిజాస్టర్.. హిందీ సినిమాలంటే భయపడుతున్న ఎన్టీఆర్