NTR: వార్ 2 డిజాస్టర్.. హిందీ సినిమాలంటే భయపడుతున్న ఎన్టీఆర్
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:24 PM
యన్టీఆర్ (NTR) - రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్ (RRR)' నార్త్ లోనూ విశేషాదరణ చూరగొంది. దాంతో యంగ్ టైగర్ కు హిందీ బెల్ట్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
NTR: యన్టీఆర్ (NTR) - రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్ (RRR)' నార్త్ లోనూ విశేషాదరణ చూరగొంది. దాంతో యంగ్ టైగర్ కు హిందీ బెల్ట్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఎందువల్లనంటే నార్త్ లో భీమ్ ను పోలిన వీరుల గాథలు ఉన్నాయి. తమ జాతి కోసం పాటు పడ్డ పోరాట యోధులు ఉన్నారు. ఈ కారణంగా 'ట్రిపుల్ ఆర్'లో రామ్ చరణ్ పాత్రకంటే యన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ రోల్ కు ఉత్తరాదిన మంచి ఆదరణ లభించింది. ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని తారక్.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. కానీ, సినిమాలో సత్తా లేకపోవడంతో 'వార్ 2 (War 2)' బాక్సాఫీస్ వద్ద పత్తా లేకుండా పోయింది. అయినా, యన్టీఆర్ పాత చిత్రాలను సైతం హిందీలో డబ్ చేసి విడుదల చేసి కొందరు ఉత్తరాది పంపిణీదారులు లాభ పడ్డారు.
యన్టీఆర్ 'వార్ 2'లో నటించే సమయంలో పలు విషయాలు విశేషంగా వినిపించాయి.'వార్ 2' తరువాత యన్టీఆర్ హిందీ 'ధూమ్ 4'లో నటిస్తారని ఓ వార్త షికారు చేసింది. అలాగే ఈ మధ్య షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందే 'పఠాన్ -2'లోనూ యన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారనీ గుప్పుమంది. కానీ, ఇప్పుడు అవేమి నిజం కాదని, అసలు యన్టీఆర్ ఇక బాలీవుడ్ లో కనిపించే అవకాశమే లేదని అంటున్నారు. దానికి కారణం వార్ 2 రిజల్ట్ కారణమని చెప్పుకొస్తున్నారు. దానివలన వచ్చిన ట్రోలింగ్ తో బాలీవుడ్ అంటేనే భయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అదేమీ లేదని అసలు యన్టీఆర్ ప్రస్తుతం తాను నటిస్తున్న తెలుగు చిత్రాలపైనే కాన్సంట్రేట్ చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. అందువల్ల ఆయనకు హిందీ చిత్రాలలో నటించాలన్న ఆసక్తి లేదని చెబుతున్నారు. ఎటూ యన్టీఆర్ కు ఉత్తరాదిన ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సినిమాలే హిందీలోనూ డబ్బింగ్ అవుతాయి కదా! సో- ప్రస్తుతానికి యన్టీఆర్ కు హిందీ మూవీస్ పై ఇంట్రెస్ట్ లేదని క్లియర్ అవుతోంది.
ప్రస్తుతం యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో యన్టీఆర్ పాత్రను అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది ప్రేక్షకులు ఇష్టపడేలా రూపొందించారట. కాబట్టి, అదే పనిగా హిందీలో నటించవలసిన అవసరం లేకుండానే యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ మురిపించనుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ మూవీ కాగానే తన 'దేవర' సినిమా సీక్వెల్ లో నటించడానికి యన్టీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారనీ తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో తారక్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.