Anweshana: నలభై ఏళ్ళ క్రితం ఫోటో.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:38 AM

థ్రిల్లర్ మూవీస్ కు మ్యూజిక్ ప్రాణం పోస్తుందని పలు చిత్రాలు నిరూపించాయి. స్టార్స్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్స్ సైతం అదే తీరున విజయపథంలో పయనించాయి.

Anweshana

థ్రిల్లర్ మూవీస్ కు మ్యూజిక్ ప్రాణం పోస్తుందని పలు చిత్రాలు నిరూపించాయి. స్టార్స్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్స్ సైతం అదే తీరున విజయపథంలో పయనించాయి. ఆ సూత్రాన్ని మరవకుండా, తన బాణీలో వంశీ (Vamsy) రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అన్వేషణ' (Anweshana). 1985లో రిలీజైన 'అన్వేషణ' చిత్రానికి ఇళయరాజా (Ilaya Raja) సంగీతం ప్రాణం పోసింది. రాజా బాణీలకు తగ్గట్టుగా వేటూరి (Veturi) కలం కదం తొక్కింది. అలా 'అన్వేషణ'లోని పాటలు ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం!

'అన్వేషణ' చిత్రీకరణ సమయంలో నాయిక భానుప్రియ (Bhanu Priya), కీలక పాత్రధారులైన సత్యనారాయణ (Satyanarayana), రాళ్ళపల్లి (Rallapalli)కి సన్నివేశాన్ని వివరిస్తూ ఇలా కెమెరా క్లిక్ లో చిక్కారు వంశీ. నలభై ఏళ్ళ క్రితం నాటి ఈ ఫోటో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఆ నాటి 'అన్వేషణ' సినిమా అభిమానులకు ఆనందం పంచుతోంది.

Anweshana

'అన్వేషణ' అనగానే చప్పున గుర్తుకు వచ్చేది అదో సస్పెన్స్ థ్రిల్లర్ అన్నదే. తరువాత ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం మదిలో మెదలుతాయి. వాటన్నిటినీ తనకు అనువుగా మలచుకొని తెరపై ఆవిష్కరించిన వంశీ ప్రతిభనూ తలచుకుంటారు. ఇక భానుప్రియ విశాలనేత్రాలను ఎవరూ మరచిపోలేరు. 'అన్వేషణ' షూటింగ్ నాటి ఈ ఫోటోను చూస్తే ఆ నాటి ఆ చిత్ర అభిమానులకు మరెన్నో విశేషాలు స్ఫురించవచ్చు. ఈ పిక్ ను చూస్తూ ఆలోచించండి!

Updated Date - Nov 23 , 2025 | 11:51 AM