సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nandamuri Balakrishna: బన్నీ.. స్టెప్ వేద్దాం రా.. ఆట పట్టించిన బాలయ్య

ABN, Publish Date - Jun 14 , 2025 | 09:30 PM

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards) ఘనంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రిటీస్ తో వేదిక అంతా కళకళలాడుతోంది. 

Gaddar Awards

Nandamuri Balakrishna: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards) ఘనంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రిటీస్ తో వేదిక అంతా కళకళలాడుతోంది.  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)తో పాటు  పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  ఇక ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జయసుధ, జయప్రద, నివేదా థామస్, సుహాసిని, మణిరత్నం, మురళీ మోహన్, నిహారిక, రాజమౌళి .. తదితరులు పాల్గొన్నారు. 

 

గద్దర్ అవార్డ్స్ వేడుకలో నందమూరి బాలకృష్ణ - అల్లు అర్జున్ సందడి అంతా ఇంతా లేదు. బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక ఆయనకు తోడు బన్నీ కూడా కలవడంతో అక్కడ మరింత హాంగామా మొదలయ్యింది.  బాలకృష్ణ, అల్లు అర్జున్ పక్కన కూర్చొని  ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  

 

Telangana Gaddar Film Awards 2024: ఘనంగా మొదలైన గద్దర్ అవార్డ్స్..  హాజరైన అల్లు అర్జున్, బాలకృష్ణ 


మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ను స్టేజిపై సింగర్స్ పాడుతుండగా.. బాలయ్య.. అల్లు అర్జున్ చేయి పట్టుకొని స్టెప్ వేద్దాం రా అంటూ ఆటపట్టించాడు. దానికి బన్నీ.. అయ్యో సార్ నా వల్ల కాదు అని చెప్పినా వినకుండా పర్లేదు అంటూ పైకి లేపబోయాడు. బన్నీ నవ్వుతూ ప్లీజ్ అంటూ బతిమాలాడడంతో బాలయ్య నవ్వుతూ సాంగ్ ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

 

 బన్నీకి, బాలయ్య కు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్  టాక్ షో చేసిన విషయం తెల్సిందే. ఈ షోకు బన్నీ రెండు సార్లు గెస్ట్ గా వచ్చాడు. ఇదే కాకుండా మొదటి నుంచి బన్నీకి.. బాలయ్య అంటే చాలా గౌరవమని, ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

 

Updated Date - Jun 14 , 2025 | 09:30 PM