Telangana Gaddar Film Awards 2024: ఘనంగా మొదలైన గద్దర్ అవార్డ్స్.. హాజరైన అల్లు అర్జున్, బాలకృష్ణ
ABN , Publish Date - Jun 14 , 2025 | 08:44 PM
ఎట్టకేలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards ) వేడుక మొదలైంది. ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
Telangana Gaddar Film Awards 2024: ఎట్టకేలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards ) వేడుక మొదలైంది. ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. హైటెక్స్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, FDC ఛైర్మెన్ దిల్ రాజు, FDC ఎండీ హరీశ్ కలిసి ఈ వేడుకను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సినీ సెలబ్రిటీలతో గద్దర్ అవార్డ్స్ వేదిక కళకళలాడుతుంది. మణిరత్నం, సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ.. తదితరులు ఈ వేడుకలో మెరిశారు. ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, FDC ఛైర్మెన్ దిల్ రాజు టెక్నీషియన్స్ కు అవార్డులను ప్రదానం చేయడమే కాకుండా వారికి రూ. 5 లక్షలు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.