December Movies: అరడజను సినిమాలు.. ఈ క్రిస్మస్ కి అందలమెక్కేది ఏది
ABN , Publish Date - Oct 21 , 2025 | 05:24 PM
ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పర్వదినంగా క్రిస్మస్ వినుతికెక్కింది... ప్రతి యేటా డిసెంబర్ 25వ తేదీన సాగే క్రిస్మస్ కు ఒకప్పుడు హాలీవుడ్, ఫ్రెంచ్, బ్రిటిష్ మూవీస్ రిలీజయ్యేవి...
December Movies: ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పర్వదినంగా క్రిస్మస్ వినుతికెక్కింది... ప్రతి యేటా డిసెంబర్ 25వ తేదీన సాగే క్రిస్మస్ కు ఒకప్పుడు హాలీవుడ్, ఫ్రెంచ్, బ్రిటిష్ మూవీస్ రిలీజయ్యేవి... ఈ సారి కూడా క్రిస్మస్ కానుకగా కొన్ని ఇంగ్లిష్ సినిమాలు వస్తున్నాయి... అయితే డిసెంబర్ 25వ తేదీన ఆరు తెలుగు చిత్రాలు విడుదల కానుండటం విశేషంగా మారింది... ఇప్పటి దాకా ఎన్నడూ క్రిస్మస్ కు తెలుగునాట ఇంతటి పోటిని చూడలేదు... అడివి శేష్ హీరోగా రూపొందిన 'డెకాయిట్ (Dacoit)', రోషన్ మేకాతో తెరకెక్కిన 'ఛాంపియన్ (Champion)', ఆది సాయికుమార్ 'శంబాల (Shambala)', విశ్వక్ సేన్ 'ఫంకీ (Funky)' చిత్రాలు డిసెంబర్ 25వ తేదీనే తమ రిలీజ్ డేట్ గా ఎంచుకున్నాయి... గుణశేఖర్ డైరెక్షన్ లో భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన 'యూఫోరియా' కూడా క్రిస్మస్ రోజునే రావాలని ఆశిస్తోంది... వీటితో పాటు కొత్తవారితో రూపొందిన 'పతంగ్' కూడా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తోంది... ఇలా క్రిస్మస్ రోజున ఆరు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధం కావడం విశేషంగా మారింది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షనీల్ డియో డైరెక్షన్ లో 'డెకాయిట్' రూపొందింది... యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ కాంపౌండ్ నుండి వస్తూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది... శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'ఛాంపియన్' స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది... ప్రదీప్ అద్వైతం డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు నిర్మిస్తూండడంతో మంచి క్రేజ్ నెలకొంది... అందరూ కొత్తవారితో నూతన దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి రూపొందించిన 'పతంగ్' కూడా కైట్స్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కావడం గమనార్హం.
ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతోన్న 'శంబాల' సూపర్ న్యాచురల్ పవర్స్ తో సాగుతుంది... దీనిని యుగంధర్ ముని తెరకెక్కించారు... అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన విశ్వక్ సేన్ 'ఫంకీ' కామెడీ జానర్ తో రానుంది... ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు... యంగ్ జనరేషన్ తో కళకళలాడుతూ ఉన్న సినిమాలతో పాటు గుణశేఖర్ డైరెక్షన్ లో భూమిక ప్రధాన పాత్రలో 'ఇఫోరియా' రూపొందింది... ఈ మూవీలో డ్రగ్స్ కారణంగా చెడుదారిన పడ్డ నవతరానికి ఓ సందేశం ఇస్తున్నారట.... ఇలా ఎవరికి వారు తమదైన బాణీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు... అందరూ డిసెంబర్ 25వ తేదీనే ఎంచుకోవడం గమనార్హం... మరి ఆరు చిత్రాల్లో ప్రేక్షకుల మదిని ఏ సినిమా ఎక్కువగా ఆకర్షిస్తుందో.. ఏ సినిమా అందలమెక్కుతుందో చూడాలి.
Akkineni Sobhita: అక్కినేని కోడలి తొలి దీపావళీ.. కోటి దీపాల కాంతి అంతా ఆమె ముఖంలోనే
Director Sujeeth: ఓజీకి రూ.6 కోట్ల సొంత డబ్బు ఖర్చు.. డైరెక్టర్ ఏమన్నాడంటే