NTR: ఆడియో రూపంలో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:45 PM

1984 పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకం త్వరలో ఆడియో రూపంలో రాబోతోంది. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆడియో బుక్ రాబోతోంది. ఈ నెల 13న దీనిని పురందరేశ్వరి ఆవిష్కరించబోతున్నారు.

1984 Parirakshanodyamam Sajeeva Charitra book

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ (NTR Literature Committee) ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (N Chandara Babu Naidu) , మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విక్రమ్ పూల (Vikram Poola) రచించిన '1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర' పుస్తకం ఆవిష్కృతమైంది. ఇప్పుడీ పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తీసుకురాబోతున్నారు.


'1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర' పుస్తకానికి లభించిన ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లు గా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడియో పుస్తకం టీజర్ ను ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ మాట్లాడుతూ, '1984 ఆగష్టు లో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగొచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని నాటి కేంద్ర పాలకులు కుట్రపన్ని పదవీచ్యుతుణ్ని చేస్తే.. ప్రజా బలంతో కాంగ్రెసేతర వ్యక్తుల సహకారంతో మహత్తరమైన ప్రజాస్వామ్య పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చరిత్రను తిరిగి రాసా'రని అన్నారు. అటువంటి ఉత్తేజకరమైన సంఘటనల సమాహారమైన విక్రమ్ పూల రచించిన 'సజీవ చరిత్ర' పుస్తక ఆడియో రూపాన్ని డిసెంబర్ 13, 2025 హైదరాబాద్ లోని ఎన్టీఆర్ తనయ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పురందరేశ్వరి విడుదల చేస్తారని చెప్పారు.

DSC00267F.jpg


ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత విక్రమ్ పూల, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్ మోహన్ రావు, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు, మండవ సతీష్, బిక్కి కృష్ణ, ఆడియో పుస్తక పర్యవేక్షకులు సినీ నటుడు అశోక్ కుమార్, సంతోష్ కుమార్, కో ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Failure Boys: బాబూమోహన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్

Also Read: Akkineni Akhil: అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి ఎన్టీఆర్ ఆరాటం..

Updated Date - Dec 08 , 2025 | 04:46 PM