Failure Boys: బాబూమోహన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:16 PM
'ఫెయిల్యూర్ బాయ్స్' మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి బాబు మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫెయిల్యూర్ బాయ్స్' (Failure Boys). ఇతర కీలక పాత్రల్లో సుమన్ (Suman), నాజర్ (Nazar), తనికెళ్ల భరణి (Thanikella Bharani) నటించారు. ఈ చిత్రాన్ని వి.ఎస్.ఎస్. కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్ర బృందం రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

'ఫెయిల్యూర్ బాయ్స్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సీనియర్ నటుడు బాబు మోహన్ (Babu Mohan) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ... 'మూవీ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాత కుమార్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
శ్రీనివాస్ జమ్మి మాట్లాడుతూ, 'ఫెయిల్యూర్ బాయ్స్ అనే ఈ సినిమాను మా మనసు పెట్టి తీశాం. ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు పింగ్ పాంగ్, డైరెక్టర్ అంజి శ్రీను, నిర్మాత విఎస్ఎస్ కుమార్, దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి ఉసిరిక, హీరో అవి తేజ్, హీరోయిన్ కోయిల్ దాస్ తదితరులు పాల్గొని, సినిమాలో తమ పాత్రల గురించి తెలిపారు.
Also Read: Bigg Boss 19: బిగ్‌బాస్ 19 విన్నర్.. గౌరవ్ ఖన్నా
Also Read: Akkineni Akhil: అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి ఎన్టీఆర్ ఆరాటం..