Akkineni Akhil: అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి ఎన్టీఆర్ ఆరాటం..

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:53 PM

ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హీరోల ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ, అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) కి మాత్రం స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ (NTR, చరణ్ (Ram Charan) లు అన్నయ్యలతో సమానం.

Akkineni Akhil

Akkineni Akhil: ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హీరోల ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ, అక్కినేని వారసుడు అఖిల్ (Akhil) కి మాత్రం స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ (NTR, చరణ్ (Ram Charan) లు అన్నయ్యలతో సమానం. ఈ విషయాన్ని అఖిల్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. వీరి ముగ్గురి మధ్య బంధం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక ఆ బంధంతోనే ఎన్టీఆర్.. అయ్యగారి కెరీర్ ని నిలబెట్టడానికి చాలా ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో అఖిల్ సీక్రెట్ మీటింగ్ టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ మీటింగ్ లో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా ఉండడంతో అఖిల్ తరువాత సినిమా నీల్ తోనే అనే పుకార్లు వెల్లువెత్తాయి.

సలార్ రిలీజ్ సమయంలో కూడా అఖిల్ కనిపించాడు. దీంతో సలార్ లో అఖిల్ ఉన్నాడని వార్తలు వచ్చాయి. అప్పటి అఖిల్ ప్రజెన్స్ కి ఇప్పుడు సమాధానం దొరికింది. అయ్యగారు.. నీల్ తో సినిమా చేయడం లేదు. కానీ, నీల్ శిష్యుడుతో ఒక సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. నీల్ .. తన శిష్యుడుని డైరెక్టర్ గా లాంచ్ చేయనున్నాడట. అఖిల్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ఆ కథను అయ్యగారికి చెప్పడం, వెంటనే అఖిల్ ఒప్పుకోవడం జరిగాయట. అప్పటి నుంచి అఖిల్.. నీల్ తోనే తిరుగుతున్నాడు. ఎన్టీఆర్ సైతం అఖిల్ ని ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పాడట. ఇప్పుడు ప్రశాంత్ నీల్.. డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండడంతో అక్కడా ఇక్కడా ఎందుకు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఇంట్లోనే మీటింగ్ పెట్టారట. ఈ సినిమాకు డైరెక్ట్ గా నీల్ డైరెక్టర్ కాకపోయినా.. పర్యవేక్షణ అయితే ఉంటుందని టాక్.

గురువు లానే శిష్యుడు కూడా హాయ్ వోల్టేజ్ కథనే అయ్యగారికి చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ ని మెయింటైన చేయనున్నాడట. ప్రస్తుతం అయ్యగారు లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్నోఅవకతవకల మధ్య లెనిన్ షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమాను ఫినిష్ చేసి అఖిల్.. నీల్ శిష్యుడి సినిమాలో అడుగుపెట్టనున్నాడు. మరి ఇందులో ఎంత వరకు నిజముంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Updated Date - Dec 08 , 2025 | 03:58 PM