Thalapathy Vijay: వ్యూస్ వివాదంలో జన నాయగన్ సాంగ్
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:27 PM
యూట్యూబ్ వ్యూస్ ను స్టార్ హీరోలు మేనేజ్ చేస్తారా? గిమ్మిక్కులు చేసి వ్యూస్ రాబట్టుకోవచ్చా? కోలీవుడ్ స్టార్ హీరో మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇలాంటి డౌట్లు అందరికీ వస్తున్నాయి. అయితే దీనిపై యూట్యూబే క్లారిటీ ఇచ్చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా 100 కోట్ల మూవీలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఈ హీరో.. ప్రస్తుతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో తన కెరీర్ లో లాస్ట్ మూవీగా 'జన నాయగన్' (Jananayagan) చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను హోరెత్తించాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఓ నెగెటివ్ క్యాంపెయిన్ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.
మాములుగా విజయ్ కు సొంతంగా సోషల్ మీడియాలో అకౌంట్లు లేవు. అయినా సరే ఆయన గురించి వచ్చే పోస్టులకు మంచి రీచ్ ఉంటుంది. ఏ విషయమైనా ట్రెండింగ్ అయ్యి టాప్‌లో ఉంచుతుంది. ఈ క్రమంలో 'జన నాయగన్' నుంచి వచ్చిన పాటకు కొన్ని గంటల్లోనే కోటి వ్యూస్ వచ్చాయి. ఇది చూసి సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. బాట్ అకౌంట్లతో విజయ్ తన ప్రచారాన్ని మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే దీనిపై యూట్యూబ్ స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది.
విజయ్ మూవీ సాంగ్ పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ (YouTube) ఆఫీషియల్ టీమ్ స్వయంగా స్పష్టత ఇచ్చింది. తమ దగ్గర ఆటోమేటిక్ ఫిల్టర్ ఉంటుందని,. నిజమైన వ్యూస్‌ని మాత్రమే కౌంట్ చేస్తామని తెలిపింది. ఫేక్ ఏమైనా ఉంటే తొలగిస్తాం అని చెప్పేసింది. ఇది చూసి విజయ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది తమ దళపతి పవర్ అంటూ ఊగిపోతున్నారు. మొత్తానికి రెండు రోజులుగా సాగుతున్న వ్యూస్ వివాదానికి చెక్ పడటంతో మూవీ లవర్స్ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: Megastar: చిరంజీవి ఆవిష్కరించిన 'కొదమ సింహం' రీ-రిలీజ్ ట్రైలర్
Read Also: Rahul Ravindran: అమ్మాయి చున్నీ తీయడం.. విమెన్ ఎంపవర్ మెంటా