సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karuppu: సూర్య ఫ్యాన్స్ కు షాక్.. కరుప్పు డైరెక్ట్ ఓటీటీకే

ABN, Publish Date - Sep 12 , 2025 | 09:27 PM

ఎప్పుడెప్పుడు కరుప్పు (Karuppu) థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సూర్య ( (Suriya) ఫ్యాన్స్ కు ఒక షాక్ తగిలింది.

Karuppu

Karuppu: ఎప్పుడెప్పుడు కరుప్పు (Karuppu) థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సూర్య ( (Suriya) ఫ్యాన్స్ కు ఒక షాక్ తగిలింది. అందుతున్న సమాచారం ప్రకారం కరుప్పు అసలు థియేటర్ లోనే రిలీజ్ కావడం లేదని, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారని తమిళ్ మీడియా కోడై కూస్తోంది. అసలు ఈ సినిమా సడెన్ గా ఓటీటీ బాట పట్టడానికి కారణం ఏంటి.. ? పొంగల్ రేస్ లో ఉంటుంది అనుకున్న సినిమా ఓటీటీకి ఎందుకు వెళ్లింది .. అనేది తెలుసుకుందాం.


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సూర్యను పరాజయలే వెంటాడుతున్నాయి. అయినా కూడా గ్యాప్ లేకుండా విజయం అందుకోవాలని చాలానే కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం సూర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా మరో సినిమా చర్చల్లో ఉంది.


ప్రస్తుతం కరుప్పు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటినుంచి ఈ సినిమాను సంక్రాంతి రేసులో దింపాలని మేకర్స్ ప్రయత్నాలు సాగించారని టాక్. దానికోసమే షూటింగ్ కూడా త్వరత్వరగా ఫినిష్ చేస్తున్నారని సమాచారం. అయితే సడెన్ గా కరుప్పు ఓటీటీ టర్న్ తీసుకుందని చెప్పుకొస్తున్నారు.కానీ, ఈ సినిమా ఓటీటీ బాట పట్టడానికి అసలైన కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు. అయితే సంక్రాంతి డేట్ ను పరాశక్తి ఫైనల్ చేయడంతో.. కరుప్పు వెనక్కి తగ్గిందని, అందుకే చేసేదిలేక ఈ సినిమాను ఓటీటీకి ఇస్తున్నారని ఒక మాట వినిపిస్తుంది. ఇందులో నిజమెంత.. కావాలనే ఈ సినిమా తప్పకుందా.. ,ఎవరైనా తప్పించారా.. అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో సూర్య ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవేళ కరుప్పు ఓటీటీకి వస్తే దానిని అత్యధిక ధరపెట్టి కొనుగోలు చేసే ఓటీటీ ఏది అనేది తెలియాల్సి ఉంది.

Mirai: నిధి అగర్వాల్ సాంగ్.. అక్కడ కూడా డౌటే

Parasakthi: అధికారికం.. సంక్రాంతి బరిలో ఇంకో సినిమా

Updated Date - Sep 12 , 2025 | 09:33 PM