Mirai: నిధి అగర్వాల్ సాంగ్.. అక్కడ కూడా డౌటే

ABN , Publish Date - Sep 12 , 2025 | 09:06 PM

ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి అంటే కథ ఎలా ఉన్నా సాంగ్స్ చూడడానికి అయినా థియేటర్ కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు నిడివి ఎక్కువ అవుతుందని, కథను సాంగ్స్ డిస్ట్రబ్ చేస్తున్నాయని సాంగ్స్ ను కట్ చేస్తున్నారు.

Mirai

Mirai: ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి అంటే కథ ఎలా ఉన్నా సాంగ్స్ చూడడానికి అయినా థియేటర్ కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు నిడివి ఎక్కువ అవుతుందని, కథను సాంగ్స్ డిస్ట్రబ్ చేస్తున్నాయని సాంగ్స్ ను కట్ చేస్తున్నారు. సినిమపై హైప్ తీసుకొచ్చిన సాంగ్ నే సినిమాలో లేకపోతే ప్రేక్షకులు థియేటర్ లో ఎలా చూస్తారు. ఈ మధ్య ఇదే ఫ్యాషన్ గా మారుతుంది. మొదట సినిమాపై బజ్ తీసుకురావడం కోసం ఒక సాంగ్ ను రిలీజ్ చేయడం, ఆ తరువాత కథ ఎక్కువ ఉందని దాన్ని కట్ చేయడం.. పోనీ ఆ సాంగ్ ను ఓటీటీలో ఏమైనా యాడ్ చేస్తారా.. ? అంటే అది లేదు. కొన్ని సినిమాలకు అలానే జరిగింది. ఇప్పుడు మిరాయ్ (Mirai) విషయంలో కూడా అదే జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.


తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిరాయ్. మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో మేకర్స్ రెండు అద్బుతమైన సాంగ్స్ ను కట్ చేశారు. అందులో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన వైబ్ ఉంది బేబీ అయితే.. ఇంకొకటి హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన స్పెషల్ సాంగ్. రైలు సీన్స్ వచ్చేటప్పు డు ఈ సాంగ్ వస్తుంది. అయితే.. ఈ రెండు సాంగ్స్ వలన కథ డిస్ట్రబ్ అవుతుందని మేకర్స్ ఈ సాంగ్స్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది.


సరే థియేటర్ లో కట్ చేశారు. కనీసం ఓటీటీలో అయినా యాడ్ చేసి రిలీజ్ చేస్తారనుకుంటే అది కూడా డౌటే అని చెప్పుకొస్తున్నారు. కానీ, ఫ్యాన్స్ మాత్రం నిధి పాప సాంగ్ కచ్చితంగా ఉండాలని, థియేటర్ లో లేకపోయినా.. కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయమని కోరుతున్నారు. మరి ప్రేక్షకుల కోరికను మేకర్స్ తీరుస్తారో లేదో చూడాలి.

Parasakthi: అధికారికం.. సంక్రాంతి బరిలో ఇంకో సినిమా

Akshay Kumar: గుట్కా తినొద్దు

Updated Date - Sep 12 , 2025 | 09:06 PM