సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sekhar Kammula : విజయ్ దేవరకొండ కుబేర ఎందుకు చేయలేదు...

ABN, Publish Date - Jul 05 , 2025 | 04:14 PM

దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర మూవీ కథను ధనుష్ కంటే ముందు విజయ్ దేవరకొండకు చెప్పాడట... అయితే తనకున్న ఇమేజ్ కు ఈ పాత్ర సరిపోదని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించాడట.

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన 'కుబేర' (Kubera) నటుడిగా అతనికి మరోసారి పేరు తెచ్చిపెట్టింది. అలానే ఈ సినిమా తెలుగులో ఫర్వాలేదనిపించింది. కానీ తమిళంలో బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ఏ మాటలు చెప్పి ధనుష్ ను ఒప్పించాడో కానీ అతను నూరు శాతం దానిని మనసులోకి తీసుకుని బిచ్చగాడి పాత్రకు ప్రాణం పోశాడు. ధనుష్ ఏ పాత్ర చేసినా అభిమానించే తమిళ జనాలు 'కుబేర'లో అతడిని బిచ్చగాడి పాత్రలో చూడలేక తిరస్కరించారు. ధనుష్‌ సినిమాలలో వీక్ ఓపెనింగ్స్ 'కుబేర'కే వచ్చాయని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


నిజానికి ధనుష్ కంటే ముందు ఈ పాత్రను శేఖర్ కమ్ముల విజయ్ దేవరకొండకు చెప్పాడట. అయితే రౌడీ హీరోగా ఇమేజ్ ఉన్న తాను బిచ్చగాడి పాత్ర చేస్తే జనాలు మెచ్చరని సున్నితంగా విజయ్ రిజెక్ట్ చేశాడట. విశేషం ఏమంటే... సినిమా అవకాశాల కోసం విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్న రోజుల్లో శేఖర్ కమ్ముల తాను తీస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ఓ క్యారెక్టర్ ను విజయ్ దేవరకొండతో చేయించాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు కాలం కలిసి వచ్చి స్టార్ హీరో అయిపోయాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'లో హీరోలుగా నటించిన వారు ఇప్పటికీ అవకాశాల కోసం వెతుక్కుంటూనే ఉన్నారు. శేఖర్ కమ్ముల మీద అభిమానం ఉన్నా... తాను ఫిట్ కాని పాత్రను మొహమాటంతో ఒప్పుకోవడం ఇష్టంలేని విజయ్ తిరస్కరించడం మంచిదే అయ్యింది. ఎందుకంటే తమిళులు ధనుష్‌ ను బిచ్చగాడి క్యారెక్టర్ లో చూడటానికి ఎలాగైతే విముఖత ప్రదర్శించారో, ఇక్కడ విజయ్ దేవరకొండనూ అభిమానులు, ప్రేక్షకులు అలానే తిరస్కరించే వారేమో! ఏదేమైనా విజయ్ దేవరకొండ తీసుకున్నది తెలివైన నిర్ణయమే అని ఇప్పుడు అందరూ అంటున్నారు.

Also Read: Ghaati: అఫీషియల్.. మరోసారి వాయిదా పడ్డ ఘాటీ..

Also Read: The Hunt: రాజీవ్ గాంధీ హత్య కేసు రివ్యూ

Updated Date - Jul 05 , 2025 | 04:14 PM