Ghaati: అఫీషియల్.. మరోసారి వాయిదా పడ్డ ఘాటీ..
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:15 PM
లేడీ సూపర్ స్టార్ అనుష్క (Anushka) ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర ఘాటీ (Ghaati).
Ghaati: లేడీ సూపర్ స్టార్ అనుష్క (Anushka) ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర ఘాటీ (Ghaati). యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా విపరీతమైన హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరువాత అనుష్క వెండితెరపై కనిపించలేదు. అందులోనూ ఈ సినిమాలో స్వీటీ మరోసారి వేశ్య పాత్రలో కనిపిస్తుంది అని తెలియడంతో క్రిష్ వేదం లాంటి సినిమాతో రాబోతున్నాడని అభిమానులు ఎక్కువ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇది మాత్రం కాకుండా డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లును పక్కన పెట్టి మరీ ఘాటీని పట్టాలెక్కించాడు. దీంతో సినిమాపై వేరే లెవెల్ లో ఉంటుందని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే పోస్టర్స్, సాంగ్స్ ఉండడంతో స్వీటీకి ఈసారి గట్టి హిట్ పడేలా ఉందని చెప్పుకొచ్చారు.
అయితే ఘాటీ మాత్రం రిలీజ్ కష్టాలను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఇక చివరికి జూలై 11 న ఘాటీ వస్తుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కానీ, ఏమైందో ఏమో మరోసారి ఘాటీ వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. 'సినిమా అనేది సజీవనది లాంటిది. కొన్నిసార్లు ముందుకు పరిగెడుతుంది. కొన్నిసార్లు లోతును సేకరించాడనికి ఆగిపోతుంది.
ఘాటీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. అదొక పర్వత ప్రతిధ్వని. ఒక రాతి నుంచి చెక్కబడిన కథ. ప్రతి ఫ్రేమ్ ను, ప్రతి సీన్ ను మరింత అందంగా చెక్కడానికి దానిని మా కౌగిలిలోనే ఉంచాము. ఈ నిరీక్షణ మరింత గొప్పగా, మరింత తీవ్రంగా, మరపురానిదిగా చేస్తుందని మేము నమ్ముతున్నాము.మీ ప్రేమకు, మీ ఓర్పుకు మరియు మాతో ఈ దారిలో నడిచినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ వస్తాం.. అప్పటివరకు మేము మీ వాళ్లమే' అని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి ఘాటీ వాయిదా అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఘాటీ ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ తో వస్తుందో చూడాలి.