Matti Kusthi: రెండో రౌండ్.. మొదలు! విష్ణు విశాల్.. మట్టీ కుస్తీ2 స్టార్ట్
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:18 PM
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా మూడేండ్ల క్రితం థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘గట్టా కుస్తీ’ .
తమిళ నటుడు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా మూడేండ్ల క్రితం థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘గట్టా కుస్తీ’ (Gatta Kusthi) తెలుగులో మట్టీ కుస్తీ (Matti Kusthi)గా వచ్చింది. తెలుగు అగ్ర నటుడు మాస్ మహారాజ రవితేజ (Raviteja), విష్ణు విశాల్‌తో కలిసి ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో నిర్మించడం విశేషం. చెల్లా అయ్యావు (Chella Ayyavu) దర్శకత్వం వహించాడు.
కుస్తీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న క్రీడాకారిణి తన పెళ్లి సమయంలో ఆ విషయాన్ని దాచి, చదువు రాని అమ్మాయిగా చెప్పి తెలుగు ప్రాంతానికి చెందిన హీరోను పెళ్లి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓ సందర్భంలో తన భార్య గురించి తెలిశాక పరిస్థితి ఎలా మారిందనే పాయింట్‌తో కామెడీ, యాక్షన్ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది.
అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా గట్టీ కుస్తీ2 పట్టాలెక్కింది. ఈ మేరకు సడన్‌గా మేకర్స్ సర్‌ఫ్రైజ్ చేస్తూ.. సెకండ్ రౌండ్ అంటూ సోమవారం ఓ అనౌన్స్మెంట్ వీడియో సైతం రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మొదటి సినిమాలో నటించిన ప్రధాన తారాగణంతో కలిసి చేసిన ఈ వీడియో సైతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే ఈ సారి వేల్స్ ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దీనికి కూడా చెల్లా అయ్యావునే దర్శకత్వం వహించనున్నాడు. గత చిత్రంలో నటించిన వారే అధిక శాలం ఇందులోనూ కంటిన్యూ కానున్నారు. ఇక ఈ సినిమాను 2026 వేసవిలో థియేటర్లకు తీసుకురానున్నట్లు సమాచారం.