సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishal: డైరెక్టర్ తో విభేదాలు.. ఆగిన విశాల్ కొత్త మూవీ

ABN, Publish Date - Oct 15 , 2025 | 07:42 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో సినిమాలు చేస్తున్నా కూడా విశాల్ తెలుగు కుర్రాడే.

Vishal

Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో సినిమాలు చేస్తున్నా కూడా విశాల్ తెలుగు కుర్రాడే. అందుకే అతనికి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మార్క్ ఆంటోనీతో మంచి విజయాన్ని అందుకున్న విశాల్ ఆ తరువాత అంతటి విజయాన్ని అందుకోలేదు. కానీ, రీరీలిజ్ అయిన మదగజ రాజా సినిమాతో మంచి హిట్ ను దక్కించుకున్నాడు.

ఇక ఈ మధ్యనే విశాల్.. తన కొత్త సినిమాను ప్రకటించాడు. రవి అరుసు దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెకెక్కుతున్న చిత్రం మకుటం. ఇందులో విశాల్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే మకుటం సినిమా మధ్యలోనే ఆగిపోయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. దానికి కారణం విశాల్ కి డైరెక్టర్ రవి అరుసుకి మధ్య విభేదాలు తలెత్తాయని టాక్. ఇదేమి విశాల్ కి కొత్త కాదు. గతంలో డిటెక్టివ్ 2 సినిమాకు కూడా ఇదే పరిస్థితి. మిస్కిన్ తో విభేదాలు పెట్టుకొని ఆ సినిమా నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశాడు. ప్రతి దాంట్లో విశాల్ జోక్యం చేసుకుంటాడని, అన్ని తనకు నచ్చినట్లు చేయాలనీ పెట్టుబడతాడని, అందుకే డైరెక్టర్స్ కు కోపం వచ్చి వెళ్లిపోతున్నారని సమాచారం. ఇక్కడ కూడా అదే జరిగిందని సమాచారం.

ఇక డైరెక్టర్ వెళ్లిపోవడంతో మకుటం మధ్యలోనే ఆగిపోయింది. కొత్త డైరెక్టర్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నారని కొందరు.. లేదు.. విశాల్ నే మెగా ఫోన్ పట్టుకొని మిగిలిన సినిమాను ఫినిష్ చేస్తున్నాడని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Prabhas- Anushka: అబ్బా.. ఎంత క్యూట్ గా హాయ్ చెప్పార్రా..

Sai Durga Tej: మా ముగ్గురు మావయ్యలకు ధ్యాంక్స్...

Updated Date - Oct 15 , 2025 | 08:11 PM