EK DEEWANE KI DEEWANIYAT: తెలుగు కుర్రాడి.. బాలీవుడ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:24 PM
తెలుగు కుర్రాడు హర్షవర్ధన్ రానే హీరోగా కొత్తగా రూపొందిన హిందీ చిత్రం ఏక్ దీవానే కి దీవానియాత్.
బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్న తెలుగు కుర్రాడు హర్షవర్ధన్ రానే (Harshvardhan Rane) హీరోగా కొత్తగా రూపొందిన హిందీ చిత్రం ఏక్ దీవానే కి దీవానియాత్ (EK DEEWANE KI DEEWANIYAT). తెలుగులో ఆటాడుకుందాం రా, హిందీలో ఇటీవల 'హౌస్ ఫుల్ 5' 'బాఘీ 4' చిత్రాలతో పేరు తెచ్చుకున్న సోనమ్ బజ్వా (Sonam Bajwa) నాయికగా నటించింది.
గతంలో'మర్జావాన్', 'సత్యమేవ జయతే' చిత్రాలను రూపొందించిన మిలాప్ జవేరీ (Milap Zaveri ) ఈ మూవీని తెరకెక్కించాడు. కునాల్ వర్మ, రజత్ నాగ్‌పాల్, రాహుల్ మిశ్రా, డీజే చేతాస్ నలుగురు కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్ స్టోరిగా సినిమా రూపొందింది. ఆక్టోబర్ 21న ప్రేక్షకుల ఎదుటకు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.