The Trial: ఓటీటీకి వచ్చేస్తోన్న కాజోల్ కోర్టు రూం డ్రామా
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:51 PM
నాటి బాలీవుడ్ అగ్ర తార కాజోల్ (Kajol) లీడ్ రోల్‌లో రెండేండ్ల క్రితం వచ్చి మంచి జనాధరణ పొందిన వెబ్ సిరీస్ ది ట్రయల్.
అలనాటి బాలీవుడ్ అగ్ర తార కాజోల్ (Kajol) లీడ్ రోల్‌లో రెండేండ్ల క్రితం వచ్చి మంచి జనాధరణ పొందిన వెబ్ సిరీస్ ది ట్రయల్ (The Trial). హాలీవుడ్ సిరీస్ గుడ్‌వైఫ్‌కు రిమేక్‌గా రూపొందిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఇప్పుడు విడేదలకు ముస్తాబయింది. జిష్‌ణు సేన్ గుప్తా, అశ్రని, కరణవీర్ శర్మ, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. ఉమేశ్ బిస్త్ (Umesh Bist) దర్శకత్వం చేసిన ఈ సిరీస్ సీజన్2 సెప్టెంబర్ 19 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ది ట్రయల్ (The Trial) ట్రైలర్ విడుదల చేశారు. భర్త ఓ కేసులో ఇరుక్కు పోవడంతో లాయర్ వృత్తి చేపట్టి ఫుల్ బిజీ అయిన నోయోనికా ఇటు భర్త, పిల్లలు, పాలిటిక్స్ నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎలా సర్వైవ్ అయింది, భర్తతో విడాకులు తీసుకుందా లేదా అనే ఇంట్రెస్టింగ్ కథనంతొ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.