ACE: విజయ్ సేతుపతి ‘ఏస్’ తెలుగు హక్కుల్ని ఎవరికి అంటే..
ABN, Publish Date - May 17 , 2025 | 06:35 PM
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupati) చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమా వస్తుందంటే అందులో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని నమ్మకం.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupati) చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమా వస్తుందంటే అందులో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని నమ్మకం. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా అరుముగం కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్’. ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అరుముగ కుమార్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ (Padmini cinemas0 దక్కించుకుంది. ఈ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ సేతుపతి ‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా కూడా మంచి రేటుకి శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ చేజిక్కించుకుంది. బి. శివ ప్రసాద్ దర్శక, నిర్మాణంలో ఇది వరకు ‘రా రాజా’ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా.. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.