Vijay Sethupathi: మరోసారి వెట్రిమారన్‌తో.. విజయ్ సేతుపతి! పూరి.. సినిమా పూర్తి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:33 PM
శింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న 'అరసన్' తెలుగులో 'సామ్రాజ్యం' పేరుతో డబ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోకి స్టార్ హీరో విజయ్ సేతుపతి అడుగు పెట్టాడు.
తమిళ స్టార్ హీరో శింబు (Simbu) తో కలైపులి థాను (Kalaipuli Thanu) నిర్మిస్తున్న సినిమా 'అరసన్' (Arasan). జాతీయ ఉత్తమ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. విశేషం ఏమంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని ఆహ్వానిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. మంగళ వారం ఆ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వెట్రిమారన్ గత చిత్రాల తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది.
విజయ్ సేతుపతి ఇటీవల పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. దానికి గుమ్మడి కాయ కొట్టగానే ఆలస్యం లేకుండా ఇప్పుడు శింబు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సోషల్ ఇష్యూస్ ను తన సినిమాల్లో డీల్ చేసే వెట్రిమారన్ ఇందులో ఎలాంటి కథ చెబుతాడో చూడాలని అతని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. 'అరసన్' మూవీకి తెలుగులో 'సామ్రాజ్యం' అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఒకటి విడుదలైంది. గతంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ 'వడ చెన్నై' మూవీ తీశారు. ఇది కూడా ఆ యూనివర్స్ కు సంబంధించిన కథే అని అంటున్నారు. ఈ సినిమాను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయబోతోంది.
Also Read: Krishna Dammalapati: హీరోగా మరో నంది అవార్డ్ చైల్డ్ ఆర్టిస్ట్...