Divya Bharathi: తెలుగు డైరెక్టర్ 'చిల‌కా' వ్యాఖ్య‌లు.. దివ్యభారతికి మద్దతు తెలిపిస‌ సినీ కార్మిక సంఘం

ABN , Publish Date - Nov 25 , 2025 | 10:35 AM

తెలుగు డైరెక్టర్ నరేష్ కుప్పిలి చేసిన అవమానకర వ్యాఖ్యలపై దివ్యభారతి ఘాటుగా స్పందించింది. దీనికి అఖిల భారత చలనచిత్ర కార్మికుల సంఘం మద్దతు ప్రకటించింది.

Divya BharathI

తనను కించపరిచే విధంగా తెలుగు సినీ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై కోలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ దివ్యభారతి (Divya Bharathi) ధైర్యంగా తన వ్యతిరేకత తెలిపారు. దీనిపై అఖిల భారత చలనచిత్ర కార్మికుల సంఘం (Cine Workers Association) సంపూర్ణ మద్దతు తెలిపింది. ‘సినిమాల్లో పనిచేసే ఏ స్త్రీ కూడా ఇలాంటి సంఘటనలు సహించదు. కానీ దృరదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తనకు జరిగిన అవమానాన్ని ధైర్యంగా నిలదీసిన దివ్యభారతిని సినీ కార్మికుల సంఘం అభినందిస్తోంది.

అలాగే, చిత్రపరిశ్రమలో బాధిత మహిళలు ఇచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే, దివ్యభారతి వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్‌ కూడా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. దివ్య‌భార‌తి సుడిగాలి సుధీర్ (sudigali sudheer) హీరోగా వ‌స్తున్న గోట్ (goat) సినిమాతో దివ్య భార‌తి తెలుగులో ఆరంగేట్రం చేస్తున్న‌ది. విశ్వ‌క్ సేన్‌తో పాగ‌ల్ సినిమా డైరెక్ట్ చేసిన నరేష్ కుప్పిలి (naresh kuppili)ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా స్టార్ట్ అయి దాదాపు మూడు నాలుగేండ్లు అవుతుంది. అయితే బ‌డ్జెట్, నిర్మాత‌, ద‌ర్శ‌కుడి మ‌ధ్య ఇష్యూ త‌దిత‌ర‌ కార‌ణాల‌తో ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు నిర్మాతే ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

కాగా.. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో హీరోయిన్ దివ్యభారతి.. డైరెక్టర్ నరేష్ కుప్పిలిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ డైరెక్టర్ కు మహిళలను గౌరవించడం తెలియదు అని ఫైర్ అయ్యింది. గ‌తంలో సుడిగాలి సుధీర్‌పై డైరెక్ట‌ర్‌ చేసిన ఒక పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ తన గురించి చిల‌కా అంటూ త‌న గురించి వ్యంగ్యంగా మాట్లాడిన తీరును ఎండగట్టింది. ఆ పోస్టులో 'ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్‌లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు?.. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై.." అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇక ఈ పోస్ట్ పై దివ్యభారతి మండిపడింది. 'స్త్రీలను చిలకా అని, లేదా మరేదైనా పేరుతో పిలవడం జోక్ కాదని, ఇది స్త్రీల‌పై ద్వేషాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇదిదొక్కటే కాదు, ఈ దర్శకుడు సెట్‌లో కూడా కూడా పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ ఉంటాడని కుండ‌బ‌ద్ద‌లుకొట్టింది. అంతేగాక ఈ విష‌యంలోసుడిగాలి సుధీర్ మౌనంగా ఉండటం నన్ను ఇంకా బాధపెట్టిందని అన్నారు. హీరోనే అలా మౌనంగా ఉంటే ఇలాంటి వాటిని అంగీక‌రిస్తున్నట్లేన‌ని చెప్పుకొచ్చింది. ఈ పోస్టు కాస్త వైరల్ గా మారింది. ఈ ఘ‌ట‌న విష‌యంలోనే చెన్నై అఖిల భారత చలనచిత్ర కార్మికుల సంఘం దివ్య భార‌తికి మ‌ద్ద‌తు తెలిపింది.

Updated Date - Nov 25 , 2025 | 12:00 PM