సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kollyood: అజిత్ సినిమాలో.. విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్

ABN, Publish Date - Nov 06 , 2025 | 10:23 PM

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తర్వాత తిరిగి యాక్షన్‌లోకి అడుగుపెడుతున్న అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం ‘ఏకే 64’ (AK 64) సినిమాతో బిజీగా ఉన్నారు.

ajith kumar

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తర్వాత తిరిగి యాక్షన్‌లోకి అడుగుపెడుతున్న అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం ‘ఏకే 64’ (AK 64) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తుండగా, జనవరిలో మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని అజిత్ ఇటీవల వెల్లడించారు.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకి అజిత్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అందుకు తగ్గట్లుగా భారీ సెట్టింగ్స్, టాప్ టెక్నీషియన్స్‌తో చిత్రబృందం ఏర్పాటవుతోంది.

తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరో ఇద్దరు ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారే విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాఘవ లారెన్స్ (Raghava Lawrence). వీరిద్దరూ విలన్ పాత్రల్లో నటిస్తారా? లేక ప్రధాన పాత్రల్లో అజిత్ సరసన కీలక రోల్స్‌లో కనిపిస్తారా? అనే అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. త్వరలో ఈ అంశంపై అజిత్ లేదా చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Nov 06 , 2025 | 10:23 PM