సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varalaxmi Sarathkumar: మొదటి పెళ్లిరోజు.. కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ భర్త

ABN, Publish Date - Jul 22 , 2025 | 02:10 PM

ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో ఉంటున్నాయో అందరికీ తెల్సిందే. ఎందుకు ప్రేమిస్తున్నారో.. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో ఎవరికీ తెలియదు.

Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar: ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఏ రేంజ్ లో ఉంటున్నాయో అందరికీ తెల్సిందే. ఎందుకు ప్రేమిస్తున్నారో.. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో ఎవరికీ తెలియదు. కానీ, కొన్ని జంటలను చూస్తే మాత్రం.. పెళ్లి బంధం అంటే ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ, పెళ్లి మీద నమ్మకం పోలేదనిపిస్తుంది. అలాంటి జంటగా మారారు కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi sarathkumar) - నికోలాయ్ సచ్ దేవ్.


కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వరలక్ష్మీ. మొదట్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసినా.. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదైనా చేయడానికి సిద్దమయ్యింది. అలా విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తూ వస్తుంది. తెలుగులో వరూకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్, శబరి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది.


మొదటి నుంచి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు అని, పెళ్లి చేసుకోను అని చెప్పిన వరూ.. గతేడాది ప్రముఖ గ్యాలరీస్ట్ నికోలాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాలతో బిజీగా మారిన వరలక్ష్మీకి తాజాగా భర్త నికోలాయ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడే వీరి వివాహం అయ్యి ఏడాది అయ్యింది. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నికోలాయ్.. వరూ కోసం ఒక కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఆమె చెన్నైలో.. అతను ముంబైలో ఉన్నా కూడా భార్యకు కారును ఇంటి వద్దకు పంపి సర్ప్రైజ్ చేశాడు. పోర్స్చే 718 బాక్స్‌స్టర్ మోడల్ పింక్ కలర్ కారును చూసి వరలక్ష్మీ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.


పోర్స్చే 718 బాక్స్‌స్టర్ మోడల్ కారు చూసి దీని రేటు ఎంత అని అభిమానులు ఆరా తీసి షాక్ అవుతున్నారు. అవును.. ఆ కారు ధర అక్షరాలా కోటి 60 లక్షలు. దీంతో మొదటి పెళ్లిరోజుకే ఇంత పెద్ద బహుమతా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా ఈ జంట కలకాలం కలిసి ఉంటే అంతే చాలు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Manchu Lakshmi: తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మీ..

Ustaad Bhagat singh: ఉస్తాద్‌లో రాశీఖన్నా అఫీషియల్‌.. దర్శకుడి ట్వీట్‌ వైరల్‌

Updated Date - Jul 22 , 2025 | 02:10 PM